విశ్లేషణలు


కరు అద్బుతమైన సంగీత బాణీలు అందించిన సంగీత దర్శకుడు .......మరొకరు ఆ బాణీలుకు స్వరాన్ని అందించిన గాయకుడు . వారే ఇళయరాజా , బాలసుబ్రహ్మణ్యం .ఇప్పుడు వీరి వివాదం సంగీత ప్రేమికులను కలవర పెడుతుంది . తన పాటలు పాడవద్దు అని ఇళయరాజా బాలు కి నోటిసులు పంపడమే ఈ వివాదానికి కారణం ....ఐతే ఇలా చెప్పే హక్కు ఇళయరాజా కి ఉందా ? బాలు చేసిన తప్పు ఏంటి ? ఈ అంశం పై విపులంగా లోతైన విశ్లేషణ ను అందిస్తున్నారు  ప్రముఖ వ్యాస కర్త     
శ్రీ ఇలపావులూరి మురళీ మోహన రావు గారు .                     బాల సుబ్రహ్మణ్యం  ఇళయరాజా ల వివాదం సినీ పరిశ్రమ లో కాక ను రగిలించింది . సినిమా రంగపు లోగుట్టు , కాపీ రైట్ చట్టాలు తెలియని వారు కేవలం తమకున్న అభిమానపు దురాభిమానాలతో  కొందరు బాలు ను , కొందరు ఇళయరాజా ను  సమర్దిస్తూ , విమర్శిస్తూ సోషల్ మీడియా లో పోస్టింగ్ లు పెడుతున్నారు . కానీ వాస్తవ అంశాలు ను ఎవరూ మాట్లాడడం లేదు . అసలు ఈ వివాదాన్ని లోతుగా పరిశీలిస్తే ........

అసలు ఇళయరాజా ఏమని నోటీసులు ఇచ్చారు ? తనకు రాయల్టీ ఇవ్వమనా ? లేక తన పాటలు పాడవద్దు  అనా ?ఇళయరాజా నోటీసులు ఇచ్చింది తన పాటలు పాడవద్దు అని . 

ఇలా నోటీసులు ఇచ్చే హక్కు ఇళయరాజా కు ఎవరు ఇచ్చారు ? అసలు అవి ఇళయరాజా సొంతమా ? కవి , గాయకుడు , సంగీత దర్శకుడు , వాద్య బృందం అనేవారు నిర్మాత దగ్గర పని చేసే ఒప్పంద కార్మికులు . నిర్మాత కు పని చేసేటందుకు వారు పారితోషకం తీసుకుంటారు . వీరందరి సమిష్టి కృషి తో ఒక పాట వెలుగు లోకి వస్తుంది . వీరందరకి ఆ పాట మీద హక్కు ఉంటుంది . ఒప్పంద పత్రం లో అలాగే రాసుకుంటారు . ఈ మూడు విభాగాలు వారికి ఈ పాట మీద హక్కు ఉన్నప్పుడు , ఈ ముగ్గురు మీద పని చేయించుకున్న నిర్మాత కు హక్కు లేదా ? సినిమా రంగం లో ప్రముఖ దర్శక నిర్మాత ఒకరు ఇళయరాజా నోటీసులు పంపడం పై నిప్పులు చెరిగారు . ఇళయరాజా ఒక్కడికే ఆ హక్కు లేదు అని అయన స్పష్టం గా చెప్పారు . 

ఇక రాయల్టీ విషయం చూద్దాం . ఈ రాయల్టీ అనేది వాణిజ్య కార్యక్రమాలు అనగా ...రేడియో , టీవీ, యు ట్యూబ్  లలో వ్యాపార ప్రయోజనాలకు వినియోగనిచుకునే సందర్బం లో ఇవ్వడం జరుగుతుంది . ఎవ్వరూ అడగకుండానే ఈ విదమైన రాయల్టీ ఆటోమాటిక్ గా చెల్లించడం జరుగుతుంది . ఉదాహరణకు ఆకాశవాణి వాళ్ళు ఏదైనా సినిమా పాట ప్రసారం చేసినపుడు కవి,గాయకుడు, సంగీత దర్శకుడు ,కు తప్పనిసరిగా రాయల్టీ చెల్లిస్తారు . వేదికల మీద పాటలు పాడే సందర్బం లో రాయల్టీ చెల్లింపు జరగదు . ఉదాహరణకు బాలు, మనో , చిత్ర లాంటి వారు ఏదైనా కార్యక్రమానికి హాజరై అక్కడ ఎవరైనా ఏదైనా పాట పాడమని అడిగితే ....వీరు పాడితే దానికి రాయల్టీ అనేది ఉండదు . పక్కా కమర్షియల్ ప్రోగ్రాం గా చేస్తున్నప్పడు రచియత కు సంగీత దర్శకుడి కి రాయల్టీ చెల్లిస్తారు . ఇక్కడ ఇళయరాజా కు కూడా అలానే చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి . ...అయినా అయన తన పాటలు పాడకూడదు అని నోటీసులు ఇచ్చారు . 

అందుకే ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ అన్నాడు " మా అన్నయ్యకు అలివిమాలిన అహంకారం , గర్వం , ముర్కత్వం అని .....!!

       బాల సుబ్రహ్మణ్యం , ఇళయరాజా వారి వారి రంగాల్లో ఒకరు ఎవరస్ట్ శిఖరం ఐతే , మరొకరు మేరుపర్వతం . ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు . కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విశేషాలు ఏమిటంటే  

చిటపట చినుకులు పడుతూ ఉంటె 
చెలికాడే సరసన ఉంటె 
అనేపాట వస్తుంది . వినేవారు ఏమని అడుగుతారు ? ఎవరు పాడారు ? అని . అంతే కానీ ఎవరు రాసారు ? ఎవరు సంగీతం అందించారు ? లాంటి ప్రశ్నలు అడగరు . దీన్ని బట్టి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే ? ఒకపాటలో ఎక్స్సపోజ్ అయ్యేది గాయనీ గాయకులు మాత్రమే . మిగిలిన వారిది తెరవెనుక కృషి . గాయనీ గాయకులు వలనే సంగీత దర్శకుడు కు పేరువస్తుంది . ఈరోజు ఇళయరాజా అనుభవిస్తున్న పేరు ప్రఖ్యాతలు బాలు , జానకి , చిత్ర ల పుణ్యం .  రాజ స్వరపరిచిన ఇదు వేల పాటల్లో తొంబై తొమ్మిది శాతం వీరు పాడినవే . రేపు ఎప్పుడైనా ఇళయరాజా మ్యూజిక్ ప్రోగ్రాం ఇస్తే , వాటిలో తమ పాటలు పాడడానికి వీలు లేదు అని బాలు , జానకి , చిత్ర నోటీసులు ఇస్తే ఇక అయన ఎవరి పాటలు వాయిస్తారు . ?

బాలు ఇళయరాజా లను మెదటి నుండి చూసిన ప్రముఖ సీనియర్ దర్శకుడు ఒకరు ఈ వివాదం పై మాట్లాడుతూ ....."ఇళయరాజా ప్రారంభదశ ఏమిటో మాకు తెలుసు . అయన సంగీత దర్శకుడు గా అడుగుపెట్టే నాటికీ బాలు , జానకీ ,సుశీల తారాపధం లో ఉన్నారు . ఇళయరాజా నిలతోక్కుకోవడానికి బాలు ఎంత సాయం చేసారో మాకు తెలుసు . వాళ్ళు పాడకపోతే అసలు ఇళయరాజా ఎక్కడ ఉన్నారు ?వాళ్ళు ముగ్గురు కొన్ని వందల సంగీత దర్శకులు దగ్గర పనిచేసారు . వేలాది పాటలు పాడారు . ఇళయరాజా అభివృద్ధి లో బాలు చిత్ర జానకి ల పాత్ర ఎంతో ఉంది . కానీ వీరి అభివృద్ధి లో ఇళయరాజా పాత్ర ఏమీ లేదు . సంగీత దర్శకుడు గా అవకాశాలు తగ్గి పదేళ్ళు పైనే అయ్యింది . ఐనా రాజా ఇంకా ప్రేక్షకులు మదిలో జీవించి ఉన్నారు అంటే అయన పాటలు టీవీ షో లలో , వేదికల మీద ఈ గాయకులు పడుతూ ఉండడమే . ఈ గాయనీ గాయకులుకు అయన క్రుతజ్ఞాడు ఐయ్యి ఉండాలి . కానీ ఆయనకు విపరీతమైన అహంకారం , తలపోగరు ఎక్కువ . నిర్మాత లను చిత్రహింసలకు గురిచేసేవాడు . నిర్మాత , దర్శకులు అయన ప్రతిభ ను గుర్తించి ,గౌరవించి ,అయన తో పని చేయించుకున్నారు . ఆ విశ్వాసం ఇళయరాజా కు లేదు . "అని కున బద్దలు కొట్టారు . 

మరి ఈ నోటీసులు దేనికి ఇచ్చారు ........

"బాలు కు ఇళయరాజా కు అవకాశాలు తగ్గి చాల ఏళ్ళు గడిచాయి . బాలు ఏనాడో ఆ విషయాన్ని గుర్తించాడు . అయన తెలివిగా టీవీ షో లలో బిజీ చేసుకున్నాడు . దాంతో బాలు సినిమా రంగం లో ఎలా బిజీ గా గడిపాడో, ఇప్పడు ప్రోగ్రాం లతో అంతే బిజీ గా ఉన్నాడు . డబ్బు కూడా బాగా సంపాదిస్తున్నాడు . కానీ ఇళయరాజా కు అలాంటి అవకాశం లేదు . పదేళ్ళు గా అయన ఖాళి గా ఉన్నాడు . ఇదే ఇళయరాజా గుండె ను మండించింది .

 ఇలా ప్రతీ వాడు అవతల వాడి కి నోటీసులు ఇస్తూ పోతే ఇక సినిమా పాటలు అనేవి టివి లలో కనిపించవు . తన పాటలు కు రాయల్టీ ఇవ్వాలి అని ఇళయరాజా కోరితే బాలు అనందం గా ఇచ్చే వారు . కానీ అయన విదేశాల్లో ఉన్నప్పుడు ఇలా నోటీసులు ఇవ్వడం బాలు ను షాక్ కు గురిచేసింది . .....తప్పు అంతా ఇళయరాజా దే ...ఇవాళ సినిమా రంగం మొత్తం ఇళయరాజా ను దుమ్మెత్తి పోస్తున్నది . .....ఆయన గురించి తెలియని అభిమానులే అయన గొప్ప వ్యక్తి అనుకుంటారు . ...నిజానికి ఆయనది ఈర్ష్య అసూయ లతో నిండిన విద్వేషిత పూరిత మానస్ తత్వం . " అన్నారు ఆ దర్శకులు . 

ఇక మీదట ఎక్కడా ఇళయరాజా పాటలు పాడకూడదు అని బాలు , మిగిలిన అందరు గాయనీ గాయకులూ ఒక నిర్ణయాని కి వచ్చారుట . ...ఇళయరాజా అహంకారానికి తగిన బుద్ది చెప్పాలని బావిస్తున్నారు ట . 

ఒక్కటి మాత్రం నిజం. సినిమా రంగం లో ప్రతిభ కంటే ప్రవర్తనకు విలువ ఎక్కువ . కృష్ణ ను చూడండి . అయన ప్రతిభ వలన సూపర్ స్టార్ కాలేదు . ప్రవర్తన వలనే అగ్ర హీరో అయ్యారు . శ్రీకాంత్ మహా గొప్ప వినయ సంపన్నుడు . అందుకే ఈ వీ వీ , ఎస్ వీ కృష్ణా రెడ్డి లు పోటీ పడి శ్రీకాంత్ తో సినిమాలు తీసారు ...ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలలో అధికారుల తీరుతెన్నుల పై విశ్లేషణాత్మక వ్యాసం అందిస్తున్నారు 
శ్రీ ఇలపావులూరి మురళీ మోహన్ రావు గారు 


ఎంతో కాలం కాలేదు . ఇటీవలే ...మహా ఐతే నెల రోజులు అయి ఉంటుంది . తెలంగాణా ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడు, శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ ఎదో మీటింగ్ లో పాల్గున్నప్ప్పుడు అక్కడి ఏర్పాట్లు ను చూస్తున్న కలెక్టర్ తో మర్యాద ల విషయం లో కొంచం గొడవ పడ్డాడు . ఆ వేదిక మీద ఒక మంత్రి , కొందరు శాసన సభ్యులు కూడా ఉన్నారు . ఒకసారి విన్న కలెక్టర్ రెండో సారి మాత్రం MLA కి  హెచ్చరిక చేసాడు . అందరూ దిగ్బ్రాన్తులు అయ్యారు . మంత్రి కానీ సహచర MLA లు కానీ బాల కిషన్ ను సమర్ధించ లేదు .
తెలంగాణా లో అధికారుల ఆత్మ గౌరవం అ విధంగా సంరక్షించ బడుతున్నది .

నిన్న ఆంధ్రా లో  ఒక MLA ,  ఒక MP ,  ఒక MLC తమ అనుచురులు తో రవాణా శాఖ కార్యాలయం లో చేసిన వీరంగం చూపరులు ను నిచ్చేస్టులు లు ను చేసింది . నిజమే mla  బూతులు ఏమీ మాట్లాడలేదు . ప్రజా ప్రతినిధులు తమ కార్యాలయాలకు వచ్చినప్పుడు ఆ కార్యాలయం అధికారులు వారిని తగు విధంగా గౌరవించాలి . వారు అడిగిన సమాచారం ఇవ్వాలి . కానీ ఈ ప్రతినిధులు అడిగిన సమాచారం ఎదో ఆరంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదం తాలూకా అట ...ఆ బస్సు జగన్ కు కావాల్సిన వారికి చెందినది అట . అందుకని ట్రావెల్స్ వారి దగ్గర లంచాలు తీసుకుని నివేదికను తోక్కిపెడుతున్నారట రవాణా శాఖ అధికారులు . 

దాని మీద గొడవ పెరిగి గౌరవనీయులు ఐన ప్రజా ప్రతినిధులు ఉప రవాణా శాఖా అధికారి మీద , అయన రక్షకుడు మీద చెయ్యి చేసుకునే వరకు వెళ్ళింది . ఇంత రగడ అవసరమా ? అధికారులు దర్యాప్తు చేసిన నివేదికలు తమ ఉన్నత అధికారులుకు , లేదా వారిని ఎవరు దర్యాప్తు చేయమన్నారో ఆ వ్యవస్థ కు మాత్రమే సమర్పిస్తారు .అంతే తప్ప దారిన పోయే దానయ్యలు అడిగితే ఇవ్వడానికి నిబంధనలు ఒప్పు కుంటాయ ?

సరే వారు ఇవ్వలేదు అప్పుడు అధికార పార్టీ ప్రతినిధులు ఏం చెయ్యాలి ?రవాణా శాఖ మంత్రి కో లేదా ముఖ్య మంత్రి కో పిర్యాదు చేయవచ్చు . అంతే తప్ప వారి కార్యాలయానికి వెళ్లి వారిని అవినీతి పరులు అని నిందించడానికి ,వారి మీద చెయ్యి చేసుకోవడానికి వీళ్ళ కు ఎవరు అధికారం ఇచ్చారు ? ప్రతి పక్ష నాయకుడు దగ్గర లంచం తీసుకుని నివేదికలు తోక్కిపెడుతున్నారు అని చెప్పడం అని చెప్పడం ద్వారా వీరు ఏం సందేశం ఇవ్వతలుచుకున్నారు . ? తమ ప్రభుత్వం లోని అధికారులు అవినీతి పరులు అనేగా ? మరి ఇదేగా లోకం ఎప్పటి నుండో కోడై కూస్తున్నది . అవినీతి లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం లో ఉన్నదని ఇటీవల ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్రువపరిచిన నివేదికను  ఇప్పుడు ఈ mla లు మరోసారి ధ్రువపరిచి ముఖ్య మంత్రి పరువును నది బజారు లో తీసేసారు . 

అది సరే ...ఆ MLA ను చూసి అధికారులు జడి లో తడిసిన సారంగం లా అలా గజ గాజా వణికిపోవడం ఏమిటి ? ఆ నీలపు చొక్కా వేసుకున్న అధికారిని చూస్తే ...విల్లు సంధించి బాణం వదల పోతున్న వేటగాడిని చూసిన హరిణం లా కనిపించారు నాకు . ఆ చేతులు జోడించి నమస్కారాలు ఏమిటి ? దీన్ని బట్టి చూస్తే ఆ అధికారి అవినీతి లో మాస్టర్స్ చేసి ఉంటాడు . అందుకే అలా వణికి పోయాడు . ...అతను నిజాయితీ పరుడు ఐతే మొదటి పేరా లో చెప్పిన కలక్టర్ లా వ్యవహరించే వాడు . 

మొన్న ఆమధ్య జగన్ అనే ప్రతి పక్ష నాయకుడు "చెయ్యి తియ్యి " అన్నందుకు ఆయనేదో రౌడీ ,గూండా అని విమర్శలు చేసి , నీ తండ్రి ని చూసి నేర్చుకో  అని హితబోధలు చేసిన అధికారులు మరి నిన్న బోండా కు, కేసినేని కి ఆ బోధలు ఎందుకు చెయ్యలేదో ? అత్యవసర సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి కి పిర్యాధులు ఎందుకు చెయ్యలేదో ?

ఒకటి మాత్రం వాస్తవం . ఆంధ్రప్రదేశ్ లో అధికారులు అవినీతి లో పడిపోయారు . రాజకీయనాయకులు తో కలిసి వాటాలు వేసుకుంటూ ప్రజలు ను దోచుకోవడం లో ఆరితేరారు . నిజాయితీ పరుడు ఐన అధికారి అయ్యుంటే ఆ mla ను గెట్ అవుట్ అని అరిచేవాడు . అసలే ుముఖ్యమంత్రి కి  ఉద్యోగులలో బోలుడెంత అపఖ్యాతి ఉంది . ఇలాంటి సంఘటనలు ఆ అపఖ్యాతి ని ఇనుమడింప చేస్తాయి .  ప్రజా ప్రతినిధులు అధికారం లో  ఉన్నప్పుడు కొంచం సహనం వహించాలి . అధికారులు మీద ఇలాంటి దాడులు ప్రభుత్వ ప్రతిష్ట ను మంట గలుపుతాయి అని వారు గ్రహించాలి . తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోలేని అధికారులు ఇక ప్రజలకేమి సేవలు చేస్తారు ?

No comments:

Post a Comment