ఆర్టికల్స్

                   కదలీ ఫలం ............... ఎంతో బలం  

                            భారతీయ హిందూ సాంప్రదాయ కార్యకరమాలలో , శుభకార్యాలలో తప్పని సరిగా ఉండే పండు అరటి పండు . అన్ని కాలాలలో లభించేది , తినగానే శక్తి ని అందించేది , చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించేది కూడా అరటి పండే .సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ఇందులో సంవృద్ది గా ఉన్నాయి.   అరటి పండు ను సంస్కృతం లో కదలీ ఫలం అని పిలుస్తారు . పేరు రావడానికి కారణం గా ఒక ఇతి హస కధ కూడా ఉంది
               
                           
ఒకప్పుడు దుర్వాసమహాముని సాయంసంధ్యవేళ కూడా ఆదమరచి నిద్రపోతున్నప్పుడు ఆయన భార్య(కదలీ) సంధ్యావందనం సమయం అయిన కారణమున ఆయనను నిద్ర నుండి మేలుకొల్పుతుంది. దుర్వాసుడు నిద్ర నుండి లేచి చూస్తే ఆయన నేత్రాల నుండి వచ్చిన కోపాగ్నికి ఆవిడ భస్మరాశి అయిపోతుంది. కొన్ని రోజుల తరువాత దుర్వాస మహర్షి మామ గారు తన కూతురు గురించి అడుగగా ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయినది అని చెప్పి, తనమామ గారి ఆగ్రహం నుండి తప్పించుకునేటందుకు, దుర్వాసముని తన భార్య శుభపద్రమైన కార్యాలన్నింటిలో కదలీ ఫలం రూపం లో వినియోగించబడుతుంది అని వరాన్ని ఇస్తాడుఅప్పటి నుండి అరటిపండు ను కదలీ ఫలం పేరుతో పిలుస్తూ అన్ని శుభ  కార్యాలలో ఉపయోగిస్తున్నామని ఇతిహాసాలు చెప్తున్నాయి .
అరటి తో అంతా మేలే
                         అరటి చెట్టు మనకు ఎంతో మేలు చేస్తుంది . చెట్టు ఆకులు , కాండం , పువ్వులు పళ్ళు ఇలా అన్ని ఉత్పత్తులు ఆరోగ్యాన్ని పెంచేవే . పూర్వం నుండి అరటి ఆకులో భోజనం చేయడం బారతీయులుకు తెలిసిందే . పువ్వులు ను వివధ పదార్ధాల రూపం లో ఆహారం గా తీసుకుంటూ ఉంటారు . బెంగాలీ , కేరళ వంటలలో ఎక్కువగా దీనిని వాడతారు .

                  అరటి చెట్టు కాండం మద్యలో ఉండే పదార్ధాన్ని దూట అని పిలుస్తారు . దీనిని కూడా వివిధ రకాల ఆహార పదార్దలు రూపం లో తీసుకుంటూ ఉంటారు . అరటి పళ్ళు ని ఇష్టపడని వారు ఉండరు అనడం లో అతిశయోక్తి లేదేమో !
అరటి పండు  లో ఏమున్నాయి ?
                                    అరటిపండు లో ఎన్నో పోషకాలు ఉన్నాయి . ఒక వంద గ్రాముల అరటి పండు నే తీసుకుంటే అందులో సుమార     నీరు - 70.1 గ్రా. , ప్రోటీన్ - 1.2 గ్రా., కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా., పిండిపదార్థాలు - 27.2 గ్రా, కాల్షియం - 17 మి.గ్రా., ఇనుము - 0.4మి.గ్రా , సోడియం - 37 మి.గ్రాపొటాషియం - 88 మి.గ్రా., రాగి - 0.16 మి.గ్రా, మాంగనీసు - 0.2 మి.గ్రా., జింక్ - 0.15 మి.గ్రా., క్రోమియం - 0.004 మి.గ్రా., కెరోటిన్ - 78 మైక్రో గ్రా, . రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా., సి విటమిన్ - 7 మి.గ్రా.థయామిన్ - 0.05 మి.గ్రా, .నియాసిన్ - 0.5 మి.గ్రా., శక్తి - 116 కిలోకాలరీలు  లభిస్తాయి .
అరటి తో ఆరోగ్యం

             
అరటి పండు లో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు .

                           
అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.

                                  
పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి.అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.పొట్టలో ఆమ్లాలు ఎక్కువైతే అరటిపండు తినండని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి ప్రకృతిసిద్ధ యాంటాసిడ్గా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటాసిడ్ ప్రభావం పొట్టలో పుండ్లను తగ్గిస్తుంది. ప్రతీ రోజు అరటి పండు తినే వారు ఒత్తిడి ని తట్టు కో గలరని ఆధునిక పరిశోదనలు తెలియచేస్తున్నాయి . హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేసే ఐరన్ అరటి పండు లో పుష్కలంగా లభిస్తుంది . అందు వలన ప్రతీ రోజు అరటిపాడు తింటే రక్తహీనత నుండి దూరం గా ఉండవచ్చు .
                                       
అమెరికాలో పాయిజన్ ఐవీ (poison ivy) అనబడే చెట్లు చర్మానికి తగిలిన వచ్చే రకమైన చర్మ వ్యాధిని అరటిపండు తోలు లోపలి భాగంతో రుద్ది నయం చేస్తుంటారుఅరటికి ఎయిడ్స్వైరస్పై పోరాడే శక్తి ఉంది.అరటిలోఉండే 'బాన్లెక్‌' అనే రసాయనం ఎయిడ్స్వైరస్పై శక్తిమంతంగా పోరాడుతుందని తేల్చారు. ప్రస్తుతం వైరస్నిరోధానికి వాడుతున్న 'టీ20, మారావిరాక్‌' మందులతో సమానంగా రసాయనం పని చేస్తుంది..అరటిలోని లెక్టిన్రసాయనం వైరస్ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్ఫెక్షన్ను నిరోధిస్తుంది. రసాయనం ప్రొటీన్పై పరచుకుని హెచ్ఐవీ జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది.


                              
అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి. అరటి తొక్క లోపల బాగాన్ని దోమ కరచిన దగ్గర రుద్దడం వలన దురద మరియు వాపు తగ్గిపోతుంది.
అందానికి అరటి
                  సౌందర్యానికి మెరుగులు దిద్దడానికి  అరటి ఎంతగానో సహాయపడుతుంది . అరటిపండు గుజ్జు ను మొహానికి ప్యాక్ గా వాడితే మంచి పలితం ఉంటుంది . మొహం పై వచ్చే మొటిమలు కూడా దూరం అవుతాయి . అరటి తొక్క గుజ్జు లో కోడి గుడ్డు సోన ను కలిపి కూడా పేస్ ప్యాక్ గా వాడవచ్చు .
అరటి ఆకు లో భోజనం
                   దక్షిణాది రాష్ట్రాలలో అరటి ఆకులో భోజనం చేయడం అనేది సంప్రదాయం గా వస్తూ ఉంది . పండగలలో శుభ కార్యాలలో తప్పని సరిగా అరటి ఆకులో భోజనం చేస్తూ ఉంటారు . అరటి ఆకులో భోజనం చేయడం మంచి దేనా అనే సందేహం చాలా మంది కి కలుగుతూ ఉంటుంది . అరటి ఆకులో భోజనం చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం తో ఉంటారని వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు . అరటి ఆకులో ఉండే పాలిపెనాల్ అనే యాంటిఆక్సిడెంట్ లు వైరస్ నుండి కాపాడతాయి . ఆకుల్లోని క్లోరోఫిల్ చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది . కిడ్నీ లో రాళ్లు జీర్ణ సంబందిత వ్యాధులు వచ్చే అవకాశం  తక్కువ గా ఉంటుంది .
              అరటి ఆకులు వడ దెబ్బ తగలకుండా కూడా కాపాడతాయి . పసి పిల్లలను ఎండా కాలం లో అరటి ఆకులో పడుకోబెట్టడం వలన వడదెబ్బ తగలకుండా చూడవచ్చు . అరటి ఆకుల ను గుజ్జు గా చేసి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది . శరీరం నల్లగా కమిలిన చోట అరటి ఆకుల గుజ్జు కొంత కాలం పాటు రాస్తే నలుపు తనం తగ్గుతుంది . చైనా దేశం లో ఐతే  ఆహార పదార్దాలు తాజా గా ఉండడానికి అరటి ఆకులను చుట్టి ఉంచుతారు .
రుచి కరమైన అరటి చిప్స్
                                అరటి కాయ తో రుచికరమైన చిప్స్ కూడా తయారు  చేస్తున్నారు . వీటిని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టం గా ఆరగిస్తారు . వీటిలో కూడా రుచికరమైన ఎన్నో ప్లేవర్స్ ను జత చేసి మార్కెట్ చేస్తున్నారు . కేరళ లో ఐతే అరటి చిప్స్ ను కొబ్బరి నూనె లో వేయించి తయారు చేస్తారు . ఇవి ప్రత్యెక మైన రుచి ని , వాసన ను కలిగి ఉంటాయి . కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిలో అరటి చిప్స్ ను జత చేసి బనానా ప్లేవర్ ను సృష్టిస్తున్నారు .

                                అరటి చెట్టు లో ప్రతీ భాగం మనకు ఉపయోగపడేదే . మన ఆరోగ్యాన్ని పెంచేదే . ఒక ఆపిల్ తినడం వలన లభించే పోషకాలు అన్నీ , ఒక అరటిపండు తినడం వలన కూడా లభిస్తాయి . అందుకే అరటిపండు ను పేదవాడి ఆపిల్ అని ముద్దు గా పిలిచుకుంటాం .

                   శ్రీరామ్ మంచి పాత కారు కొందాం అనుకుంటున్నాడు . స్నేహుతులు అందరికీ చెప్పాడు. ఎవరు అమ్మినా కొనడానికి  సిద్దం గా ఉన్నాడు . స్నేహుతుల సలహా తో ఆన్ లైన్ ప్రకటనల వెబ్ సైట్ లో లో వెదికాడు.ఒక మంచి కారు దొరికింది. అదీ కూడా తక్కువ ధరకు . ఇంకేంటి శ్రీరామ్ ఆనందానికి అవధులు లేవు . వెంటనే కోనేయాలనే ఉద్దేశ్యం తో కారు అమ్ముతానని ప్రకటన ఇచ్చిన వారికి       మెయిల్ చేసాడు . త్వరలో విదేశాలకు వెళ్ళుతుండడం వలన తక్కువ ధరకు అమ్మేస్తున్నామని , మీకు కావాలంటే కారు మీకు పంపడానికి అయ్యే ఖర్చుల కోసం కొంత నగదు ను ఎకౌంటు లో డిపాజిట్ చేయాలనీ తెలియచేసారు . శ్రీరామ్ వెంటనే వారు అడిగిన మొత్తం ఎకౌంటు లో వేసాడు . కానీ ఎన్ని రోజులైనా కానీ కారు రాలేదు . వారి -మెయిల్ నుండి జవాబు లేదు . వారి ఫోన్ నెంబర్ పని చేయడం లేదు . శ్రీరామ్ కి అప్పుడు అర్ధమైంది  మోసపోయానని . నేడు తరహ మోసాలు చాలా  ఎక్కువ జరుగుతున్నాయి


మాయమాటలతో , నమ్మించి వివిధ రకాలు గా మోసం చేస్తున్నారు . నేడు సమాజం లో జరుగుతున్న మోసాలపై అవగహన పెంచుకుంటే , వాటి నుండి బయట పడడానికి అవకాశం  ఉంటుంది .

ఎన్నో రకాలు ...............
                                 కేవలం సులభం గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యం తో మోసాలకు సిద్దపడుతున్నారు మోసగాళ్ళు . ఎక్కడో దూరం గా ఉండి  ఇంటర్నెట్ ను ,ఫోన్ కాల్స్ ను ఉపయోగించుకుని మోసాల కు పాల్పడితే దొరకడం కష్టం అనే ఆలోచనే వారిని మోసాల వైపు నడిపిస్తుంది ..
మీరు ఇవి కూడా చదవ వచ్చు 


మధ్య కాలం లో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ద్వారా స్నేహితుల గా పరిచయం చేసుకుని వివిధ రకాలు గా మోసం చేస్తున్నారు . వ్యక్తి గత సమాచారాన్ని సేకరించి ఆర్దికం గా మోసం చేయడం , మాయ మాటల తో నమ్మించి వివిధ రకాలు గా మోసం చేయడం వీరి లక్ష్యం .

                                   విజయవాడ లో ఉంటున్న స్నేహ కు FACEBOOK ద్వారా  నీరజ్ అనే కొత్త స్నేహితుడు పరిచయం అయ్యాడు . ప్రతీ రోజు ఆన్ లైన్ లో మాట్లాడుకునే వారు . తన స్నేహితుడు అమెరికా లో మంచి ఉద్యోగం లో ఉన్నాడని అతని మాటల  ద్వారా  తెలిసింది . ఒక రోజు మన అభిప్రాయాలూ ఒకేలా ఉన్నాయి , మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాడు . స్నేహ కు కాదు అనడానికి కారణం కనబడలేదు . త్వరలోనే ఇండియా కు వచ్చి  పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు . స్నేహ తన కుటుంబ  సభ్యులకు పెళ్లి గురించి చెప్పింది . వాళ్ళు కూడా చాల సంతోషించారు . ఒకరోజు నీరజ్ ఫోన్ చేసి పెళ్లి కోసం నగలు ఏమి కొనకు , నీకు నేను ఇక్కడ నుండి పంపుతున్నాను అని చెప్పాడు . స్నేహ చాలా  సంతోషించింది .తరువాత రోజు నీకు నగలు అన్నీ  కొరియర్ ఇచ్చాను , 15 రోజులలలో నీకు అందుతాయి అని చెప్పాడు . సరిగ్గా పది రోజుల తర్వాత స్నేహ కు ఢిల్లీ కస్టమ్స్ డిపార్టుమెంటు నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది . మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చింది . అందులో విలువైన డైమెండ్ నగలు ఉన్నాయి . వాటికి కస్టమ్స్ టాక్స్ రెండు లక్షలు కట్టాలి అని ఫోన్ కాల్ సారంశం . స్నేహ నీరజ్ కి కాల్ చేసి ఫోన్ కాల్ గురించి చెప్పింది . వెంటనే 2 లక్షలు కట్టి పార్సిల్  విడుపించుకో , నేను ఇండియా రాగానే నీకు 2 లక్షలు ఇస్తానని చెప్పాడుస్నేహ వెంటనే కస్టమ్స్ డిపార్టుమెంటు వాళ్ళు ఇచ్చిన బ్యాంకు ఎకౌంటు నెంబర్ లో 2 లక్షలు జమ చేసింది . కాని ఎన్ని రోజులైనా పార్సిల్ రాలేదు . స్నేహ  నీరజ్ కు కాల్ చేస్తే అతని ఫోన్ పనిచేయడం లేదు . ఆన్లైన్ లో అందుబాటు లో లేడు . ఢిల్లీ కస్టమ్స్ డిపార్టుమెంటు అని చెప్పిన నంబర్స్ కు కాల్ చేసినా అది కూడా పని చేయడం లేదు . స్నేహ కు అప్పుడు తెలిసింది  తను మోసపోయానని . ఇది మధ్యకాలం లో జరిగిన ఒక మోసం . ఎదుటి వారి బలహీనత ను తమకు అనుకూలం గా  మార్చుకుని చేసిన మోసం .
                      
                            ఇలాగే ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైటు లో మోసం చేస్తున్నారు . గత యేడాది ఒక రక్షణ శాఖ ఉద్యోగి FACEBOOK ద్వారా పరిచయం అయిన స్నేహితురాలికి దేశ రహస్యాలు వెల్లడించి పోలీసులకు దొరికాడు . బ్యాంకు ఎకౌంటు వివరాలు, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుని కూడా మోసాలకు పాల్పడుతున్నారు .

                   ఉచిత ప్రకటనలు వెబ్ సైట్  ద్వారా ఎన్నో రకాల వస్తువులు కొత్తవి , పాతవి అమ్మకానికి ఉంచి వివిధ రకాలు గా మోసాలకు పాల్పడుతున్నారు . తక్కువ ధర కు మంచి వస్తువులు లభిస్తాయని మనం తొందర పడితే , ముందుగా నగదు చెల్లిస్తే మోసపోవడం ఖాయంఖరీదుఐన  ఫోన్స్ తక్కువ ధరకే ఇస్తానని హైదరాబాద్ లో వ్యాపరస్తుడిని ఇలానే మోసగించారు . మన బ్యాంకు నుండే మనకు కాల్ చేసినట్టు చేసి మన డెబిట్ /క్రెడిట్ కార్డుల వివరాలు తెలుసుకుని మోసాలకు పాల్పడే వారు కొంతమంది . మన కంప్యూటర్ కి , మొబైల్స్ కి నకిలీ వెబ్సైటు లింక్స్ పంపి మన వివరాలు తస్కరించే వారూ ఉన్నారు . నకిలీ సాఫ్టవేర్ లతో మన కంప్యూటర్ , మొబైల్ ఫోన్స్ లో చొరబడి మన వ్యక్తి గత వివరాలు అంటే బ్యాంకు ఎకౌంటు నంబర్స్ , డెబిట్ /క్రెడిట్ కార్డు నంబర్స్ , పిన్ నంబర్స్ , ఈమెయిలు పాస్వర్డ్ లు వంటి విలువైన సమాచారాన్ని దొంగిలించి మనకు నష్టం కలిగిస్తుంటారు . మన మెయిల్స్ కి , మొబైల్స్ కి మనకు లాటరీలు తగిలినట్టు , కోట్ల రూపాయల ధనం మనం గెలుచుకున్నట్టు కూడా సమాచారాన్ని పంపి మోసం చేస్తున్నారు .డెబిట్ /క్రెడిట్ కార్డు ఎలెక్ట్రానిక్ సమాచారాన్ని కాపీ చేసి నకిలీ కార్డు లు తయారు చేస్తున్నారు . ఆన్లైన్ లో ప్రకటనలు చదవడం ద్వారా , మెయిల్స్ చదవడం ద్వారా కూడా డబ్బు సంపాదించండి అంటూ కొంతమంది మోసగాళ్ళు వల విసురుతున్నారు . ప్రముఖ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు అంటూ మెయిల్స్ పంపి నిరుద్యోగులు ను దోచుకుంటున్నారు . ATM దగ్గర , బ్యాంకు   దగ్గర పది రూపాయల నోట్లు జల్లి మన ద్రుష్టి మళ్లించి దోచుకునే వారు ఉన్నారు . ATM లోపల చిన్నపాటి యంత్రాలతో మన డెబిట్ కార్డు లో ఉన్న ఎలెక్ట్రానిక్ సమాచారాన్ని కాపీ చేసి డూప్లికేట్ కార్డు లు తయారు చేసే వారు ఉన్నారు .
అవగాహనే విరుగుడు .....................

                                   ఇలాంటి మోసాల వలన నష్ట పోతున్న వారిలో వారు వీరు అని లేకుండా విధ్యార్దులు ,వ్యాపారస్తులు , ఉద్యోగస్తులు అన్ని వర్గాల ప్రజలు ఉంటున్నారు . ఆర్దికం గా ఎంతో నష్ట పోతున్నారు . ఇటువంటి మోసాల తీరు తెన్నుల పై అవగాహన కలిగి ఉండడం వలన మోస పోకుండా ఉండవచ్చు . మన బ్యాంకు అధికారులు ఎప్పుడూ మన డెబిట్ /క్రెడిట్ కార్డు వివరాలు మెయిల్స్ లేదా ఫోన్ ద్వారా అడగరని గుర్తు పెట్టుకోవాలి. మన కార్డు పిన్ నెంబర్ ను ఎవరకీ  చెప్పరాదు . ఆన్లైన్ లో కొత్త వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు జాగ్రత్త గా వ్యవహరించాలి . వ్యక్తిగత సమాచారం ఎవ్వరకి చెప్పరాదు .పెట్రోల్ బంక్ లలో ,షాపింగ్ మాల్స్ లో బిల్ల్స్ కోసం డెబిట్/క్రెడిట్ కార్డు లు ఇచ్చినప్పుడు వెంటనే తీసుకోవాలి . మీ ఇంటర్నెట్ USER ID PASSWORD లు ఎవ్వరకి మెయిల్స్ ద్వారా కానీ సంక్షిప్త సందేశాలు ద్వారా కానీ పంపరాదు . నెట్ బ్యాంకింగ్ వ్యహారాలు సొంత కంప్యూటర్ లో మాత్రమే నిర్వహించుకోవాలి . పబ్లిక్ నెట్ సెంటర్ లు మీ బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వహించడానికి ఎంత మాత్రం సేఫ్ కాదు అని గుర్తుపెట్టుకోండి . మీ బ్యాంకు ఎకౌంటు లో మీ మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోండి . దాని వలన మీ ఎకౌంటు లో జరిగే లావాదేవీ సమాచారం మీ మొబైల్ కి సంక్షిప్త సందేశం రూపం లో అందుతుంది . మీ బ్యాంకు నుండి ఏమైనా మెయిల్స్ వచ్చినప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే బ్యాంకు కు వెళ్లి తెలుసుకోండి . ప్రముఖ సంస్థ లు పంపినట్టు గా ఇంటర్వ్యూ లెటర్స్ , సంక్షిప్త సందేశాలు వస్తే నేరుగా సంస్థ వారిని కలవండి . మీకు వచ్చే మెయిల్స్ సంస్థ అధికారక ఈమెయిలు నుండి వచ్చిందా లేదా అనేది గమనించండి . ATM  లో ఏమైనా అనుమానాస్పద వస్తువులు , యంత్రాలు ఉంటే బ్యాంకు వారికి లేదా పోలీస్ వారికి  తెలియచేయండి . ఎప్పుడైనా మోసపోయిన సంధర్బం లో వెంటనే పోలీస్ వారికి తెలియపరచండి . ఎందుకులే అని ఊరుకుంటే మనలానే మరొకరు మోసపోతారు
-ధన్విక్

​                  
కప్పు కాఫీ ఉల్లాసాన్ని ఇస్తుంది . ఉత్సాహన్ని నింపుతుంది . ఆరోగ్యం గా ఉంచుతుంది . అలసట ను దూరం చేస్తుంది . జ్ఞాపకశక్తి ని  వృద్ధి చేస్తుంది . అందుకే ప్రతీ రోజు కప్పు కాఫీ ని సేవించమని వైద్యులు సూచిస్తున్నారు .

       ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఏకైక పానీయం కాఫీ . కాఫీ గింజలను వేయించి పొడిచేసి , వేడినీటి లో మరిగించి డికాషన్ తయారు చేస్తారు . డికాషన్ ను పాలలో కలిపి , పంచదారను చేర్చి సేవిస్తారు . దీని రుచి ని ఒక్క సారి అలవాటు పడితే వదిలి పెట్టడం కష్టం . దానికి కారణం  దీనిలో ఉండే కెఫీన్ అనే పదార్ధం


           
          సాదారణంగా ఉదయపు వేళలో , అల్పాహారం తర్వాత దీనిని సేవిస్తాం . విందు వినోదాలలో ఇది తప్పని సరి . ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల లో , అన్ని సంస్కృతి లలోని  ఆహారపు అలవాట్లు లో ఇది ఒక భాగం గా  మారి పోయింది . మన దేశం లో పాలతో చేర్చి కాఫీ ని సేవిస్తారు , కానీ అమెరికా యూరప్ వంటి దేశాలలో పాలను కలపకుండా నే సేవిస్తారు . కాఫీ ని అతి వేడి గా కానీ అతి చల్ల గా కానీ తాగడం చాలామందికి అలవాటు .
            కాఫీ ని మొట్టమొదట గా ఇదియోఫియా దేశం లో కనిపెట్టినట్టు చరిత్ర చెపుతుంది . 15 శతాబ్దం లో నరాల నొప్పి నివారణ కు మందుగా వాడేవారు . అరేబియా లో కాఫీ గింజలను వేడి నీటి లో మరిగించి నీటి ని నిద్ర రాకుండా ఉండడం కోసం త్రాగేవారు . నీటి ని ఖవా  అని పిలిచేవారు . 1930 లో  మాక్స్ జర్సన్ అనే జర్మనీ వైద్యుడు లివర్ , కాన్సెర్ , మోటబాలిజం వంటి శారీరక రుగ్మతలకు మందు గా కాఫీ ని ప్రమోట్ చేసాడు . తరువాత కాలం లో నెమ్మది నెమ్మది గా  ప్రపంచ వ్యాప్తం గా అందరిని ఆకట్టుకుంది కాఫీ . నేడు కాఫీ ప్రియులు ప్రపంచం అంతా ఉన్నారుప్రస్తుతం సుమారు 70 దేశాలలో ప్రధాన వాణిజ్య పంటగా  దీనిని పండిస్తున్నారు . నేడు కాఫీ ఎన్నో రకాలులో , ఎన్నో రుచులలో లభిస్తుంది    కాఫీ తో ఆరోగ్యం ........

                                   కాఫీ సేవించ గానే శరీరం అంతా ఎంతో ఉత్హాహం నిండుతుంది . కాఫీ పొడికి చికోరి చేర్చడం వలన సరి కొత్త రుచి వస్తుంది . ప్రతీ రోజు కాఫీ తీసుకోవడం వలన అల్జీమర్స్ వంటి వ్యాధులకు దూరంగా ఉండగలమని దక్షిణ ప్లోరిడా యూనివర్సిటీ అధ్యనం లో తేలింది . కాఫీ లో ని కెఫీన్ లు శరీరం  లో ని రక్తపు  స్థాయి ని పెంచుతుంది అని అద్యనాలు వెల్లడి చేస్తున్నాయి . కాఫీ తాగడం వలన గుండె కు కూడా మేలు జరుగుతుంది . కాఫీ లో ఉండే కెఫిన్ గుండెకు రక్షణ కల్పిస్తుంది . రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తో పక్షపాతం వంటి జబ్బులు దరిచేరవని వైధ్య నిపుణులు తెలియచేస్తున్నారు .   కాఫీ తాగితే శరీరం లోని చెడ్డ కొలస్ట్రాల్ ను అరికట్టవచ్చు అంతే కాకుండా మెదడు లోని రక్తం గడ్డ కట్టడాన్ని కూడా 14% వరుకు తగ్గిస్తుంది అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి . ప్రతిరోజు దీర్ఘకాలం పాటు కాఫీ ని సేవిస్తే మధుమేహం తో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాసం కూడా తక్కువ . పనిలో ఏకాగ్రత చురుకుతనం జ్ఞాపక శక్తి కూడా పెరుగుతాయి . కాన్సర్ వచ్చే అవకాశాలు ను కెఫిన్ తగ్గిస్తుంది . కెఫిన్ టైపు  2 మధుమేహం ను వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది అని పరిశోధన లలో వెల్లడైంది . జ్జ్ఞాపక శక్తి పెరుగుదల లో కూడా కాఫీ ఎంతగానో దోహద పడుతుంది . ఎన్నోఅధ్యనాలు లో కాఫీ తాగే మహిళలకు బ్రెస్ట్ కాన్సెర్ సోకే అవకాశాలు తక్కువ అని తేలింది . హార్వార్డ్ స్కూల్ అఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ చేసిన అధ్యాయనం లో ప్రతీ  రోజు కాఫీ తాగే వారిలో ప్రోస్టేట్ కాన్సర్ దరికి చేరదని తేలింది .


ఎక్కువ తీసుకుంటే ముప్పే .....
        కాఫీ ని మితం గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో , ఎక్కువ గా తీసుకుంటే అంత చేటు చేస్తుంది . కెఫిన్ రక్త నాళాలు ను కుదించడం వలన రక్తపోటు వచ్చే అవకాసం ఎక్కువ ఉంటుంది . అంతే కాదు ఎక్కువ మోతాదు లో సేవించడం వలన నిద్రలేమి దరిచేరవచ్చు . కాఫీ తాగడం అలవాటు గా మారి ఒక్కసారి గా మానివేయడం వలన కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు . చేతులు వణకడం ,అలసట నీరసం ,తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు . కాబట్టి కాఫీ ని మితం గా  సేవిస్తే ఎన్నో ప్రయోజలను సొంతం చేసుకోవచ్చు .
కాఫీ మరికొన్ని విశేషాలు ​…..

* ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియులు అంతా కలిసి రోజుకు 1.6 బిలియన్ కప్పుల కాఫీ తాగుతారని ఒక చిత్తు లెక్క
* వేల సంవత్సరా క్రితం కాఫీ గింజలతో నే కాకుండా జంతువుల ఎముకులు తో కుడా కాఫీ తాయారు చేసేవారట .
*ప్రముఖ కాఫీ చైన్  స్టోర్ ఇన స్టార్ బక్స్  లో ప్రతీ 16 ఒన్స్ కాఫీ లో దాదాపు 10 కేన్ల కోక్  లో ఉండేటంత కొకైన్ ఉంటుందిట .
*ధాయిలాండ్ లో కాఫీ ప్రియులు కు రెస్టారెంట్ సరికొత్త కాఫీ ని రుచి చూపిస్తుంది . కాఫీ గింజల ను ఏనుగు చేత తినిపించి , వాటి మల విసర్జన తర్వాత కాఫీ గింజల ను వేరు చేసి వాటి తో కాఫీ తాయారు చేస్తారుట అక్కడ . పైగా కాఫీ రుచి చాలా  బాగుటుంది అని కాఫీ ప్రియులు కూడా ఇష్ట పడుతున్నారు . దీని ధర కూడా కాస్త ఎక్కువే
- ధన్విక్
                     ఓ పసి వాడి చిరు  నవ్వు ....ఆ ఇంట సంతోషాన్ని నింపుతుంది . ముద్దు ముద్దు మాటలతో ఆ కుటుంబం కడుపు నిండి పోతుంది . ఆ ఇల్లు ఓ నందన వనం లా మారిపోతుంది .  కల్మషం లేని ఆ చిరునవ్వు నిత్య వసంతాన్ని తీసుకువస్తుంది .  


                పిల్లలు ఇంట్లో నిత్యం ఎన్నో వస్తువులతో ఆడుకుంటారు . వారికి ఆటే లోకం . కానీ ఇంట్లో పసివారికి  అపాయాన్ని కల్గించే ఎన్నో వస్తువులు ఉన్నాయి . ఒకో సారి .....  అవసరాన్ని తీర్చే వస్తువులు ......భయాన్ని సృష్టించవచ్చు ..... . చిన్న చిన్న వస్తువులు ......మాట రాకుండా చేయవచ్చు  . ప్రతీ రోజు కనువిందు చేసే వస్తువులు .....అత్యవసర పరిస్థిని కలింగిమ్చవచ్చు . ఒక్క క్షణం ఏమరుపాటు జీవితాలు తారుమారు చేయచ్చు ...... ఆనంద క్షణా లు ను ఆవిరి చేయచ్చు .
                     
      ఒకటా రెండా ఆలోచిస్తే ప్రతీ వస్తువు బయాన్ని కల్గిస్తుంది . అపాయాన్ని మోసుకుని వస్తుంది ఏమో అనిపిస్తుంది . ఇంట్లో ఉండే ప్రిజ్ , టీవీ , గ్యాస్ స్టవ్ , ఏమర్షన్ రాడ్ ,కంప్యూటర్,  పవర్ ప్లగ్ లు , సర్ఫ్ , క్లీనింగ్ ఆసిడ్ , కొబ్బరి నునె , ఇలా ఒకటేమిటి ప్రతీ ది ఆ పసి వారికి అపాయాన్ని తెచ్చేవే . వారికి  ఏం తెలుసు ? వాటి జోలికి పోకూడదని . అవి ఆట వస్తువులు కావని . ఆ ఎదిగే వయసు లో ప్రతీ ది తెలుసుకోవాలనే కోరిక . ఆడుకోవాలనే తాపత్రయం . అప్పుడప్పుడే వస్తున్న పాల పళ్ళు .....ప్రతీ వస్తువని కొరకమంటుంటే.....వారి చిలిపి అల్లరి ఏం చెప్పగలం ?

                ఇంట్లో పిల్లల ను కంటికి రెప్పలా చూస్తూనే ఉంటాం . కానీ  ఉరకలేసే వారి ఉత్సాహం ఒకో సారి మనం చూడకుండానే ఎన్నో అల్లరి పనులు చేయిస్తుంది . కాబట్టి మనమే ప్రమాద కరమైన వస్తువులు వారికి అందకుండా చూసుకోవాలి . వారి అట వస్తువులలో కూడా విద్యుత్ ను అందించే బాటరీ లు (వీటిలో చిన్న చిన్న బాటరీ లు కూడా ఉంటాయి వీటిని బటన్ బాటరీ లు అంటారు )  , రిమోట్ కంట్రోల్స్ , మ్యూజికల్ గ్రీటింగ్ కార్డ్స్ , ఎలక్రానిక్ కీ చైన్స్ వంటి వాటితో పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు . వీటిలో ఉండే బాటరీ లు పిల్లలు  నోటిలో పెట్టుకునే అవకాసం ఉంది . ఇవి కుడా ప్రమాదాన్ని కలిగించేవే . విషతుల్యమైన బాటరీ లు మింగితే పెను ప్రమదాన్నే తెచ్చి పెడతాయి . కాబట్టి పిల్లలు ఆడుకుంటున్నా వారిని గమనిస్తూనే ఉండాలి . అమెరికా లో ప్రతీ సవత్సరం సుమారు 2800 మంది కి పైగా పిల్లలు చిన్న చిన్న బాటరీ లు మింగడం వలన హాస్పిటల్స్ లో చేరుతున్నారు . ప్రతీ సవత్సరం ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.కాబట్టి గృహాలలో బాటరీ లు పిల్లల కు అందకుండా ఉంచాలి . ఎలక్ట్రానిక్ వస్తువులలో నుండి బాటరీ లు బయటకు రాకుండా టేప్ తో అతికించాలి .  ఒకవేళ బాటరీ లు మింగితే వెంటనే అత్యవసరం గా హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలి . వైద్యుడు చెప్పేవరకు వారికి తినడానికి , తాగడానికి ఏమీ ఇవ్వకూడదు .
              ఇంట్లో ఉండే నీటి తోట్టెలు దగ్గర కూడా పిల్లలును జాగ్రత్త గా చూసుకోవాలి . సాదారణం గా పిల్లలు నీళ్ళు అంటే ఇష్టపడతారు . వాటితో ఆడుకోవాలి అనుకుంటారు . పూర్తి గా నీటి తో నిండి ఉండే బకెట్లు కూడా 1,2 ఏళ్ళ పిల్లల దగ్గర ప్రమాదమే .

                              ఇంటిలో వంట పొయ్యి లు , వేడి నీళ్ళు పిల్లలకు అందకుండా చూడాలి . ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వారు వాటిని ముట్టుకునే ప్రమాదం ఉంది . ఇంట్లో వాడుకునే సబ్బులు , క్లీనింగ్ ఆసిడ్ లు , సర్ఫ్ లు వంటి వాటిని పిల్లలకు అందకుండా చూసుకోవాలి . అలాగే ఇంట్లో ఉండే మందులు , టానిక్ లు వంటి వాటిని వారికి అందకుండా పెట్టుకోవాలి  . చిన్న పిన్నులు , గొళీలు, అలంకరణ సామాగ్రి కూడా మనం చూడకుండానే పిల్లలు నోట్లో పెట్టుకునే అవకాసం ఉంది . ఇక విద్యుత్ ఎంత ప్రమాదమో మనకందరకి తెలిసిందే . పిల్లలు కి అందేలా ప్లగ్ బోర్డ్ లు ఉంటే వాటిని టేప్ తో ముసి ఉంచాలి  లేదా వాటిలోకి కరెంట్ రాకుండా జాగ్రత్త పడాలి . లేదంటే ప్లగ్ బోర్డ్ ల లోకి పెన్నులు , పెన్సిల్స్ వంటి వాటిని దూర్చి పిల్లలు ఆడడానికి ప్రయత్నిస్తారు .

                                కొంతమంది పిల్లలు కొచెం ఎత్తులో ఉండే టీవీ లు , కంప్యూటర్ లు ను వాటి వైర్లు లాగి ఆడుతూ ఉంటారు . అవి వారి మీద పడే ప్రమాదం ఉంది . చాలా రకాల ఫ్రి జ్ లు వెనకాల వైపు ఓపెన్ గా ఉంటాయి . వాటి మోటార్ బయటకు కనపడుతూ ఉంటుంది . పిల్లలు వీటిని పట్టుకునే ప్రమాదం ఉంది . ఇక ఇంట్లో ఉండే అద్దాలు పిల్లలు కు  అందేలా ఉంచితే వాటి కొనలు పిల్లలుకు గుచ్చు కునే ప్రమాదం ఉంది . వారి ఆటలో అద్దం చేజరినా  పగిలి వారికి గుచ్చుకోవచ్చు .
                       అపార్ట్ మెంట్ లలో ఉండే వారు , ఇళ్ళలో మొదటి ఫ్లోర్ లలో ఉండేవారు పిల్లలు బాల్కనీ లో ఆడుతున్నప్పుడు జాగ్రత్త పడాలి .బాల్కనీ లో నుండి కాళ్ళు పై కెత్తి కిందకి చూస్తూ ఆడుతూ ఉంటారు .పిల్లలు ఆడుకుంటున్నారు అని వదిలేయకుండా వారిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి . ఇళ్ళలో ఉండే కిటీకీలు తలుపులు వేసివుంచాలి . ఒకోసారి ఎటువంటి గ్రిల్ల్స్ లేకపోతే , వారి అట లో బాగంగా వాటిలో నుండి దూకడానికి ప్రయత్నిస్తారు . పడక గదిలో పరుపు పై నించుని ఆటలాడే పసివారు ఉన్నారు .ఇది కూడా ప్రమాదమే . పరుపు పై పరిగెడుతూ పక్క న ఉండే వస్తువులపై లేదా గోడ పై పడే ప్రమాదం ఉంది .  
                    ఇవి అన్నీ పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే మన ఇంట్లో నే పొంచి ఉన్న ప్రమాదాలు .ఇవి అతిసయోక్తులు కావు . కొన్ని కొన్ని సంఘటనలలో ఎంతో మంది పసివారు గాయపడిన వారు ఉన్నారు . అత్యవసర పరిస్థితి ని ఎదుర్కున్న వారు ఉన్నారు . మన అజాగ్రత పిల్లలకు శాపం గా మారకూడదు . వారి అట పాటలతో మన నట్టింట ఆనందాలు ఎప్పుడూ విరబూయాలంటే అప్రమత్త తో వారిని గమనిస్తుండడం ఒకటే మార్గం . వీలు ఐనంతవరకు వారికి అందేలా ఆయా వస్తువులు లేకుండా ఏర్పాటు చేయగలగాలి . ఆపద ఏదైనా కానీ చిన్నదే కదా అని నిర్లక్షం చేయకుండా వెంటనే వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళాలి . కొన్ని కొన్ని సంధర్బాలలో   అప్పటి కప్పుడు పరిణామాలు కనపడక పోయినా , తరువాత నెమ్మది గా వాటి ప్రభావం ఉంటుంది . కాబట్టి వెంటనే వైద్యుని వద్దకు తీసుకుని వెళ్లి వారి సలహాలు పాటించాలి .

                                తల్లి తండ్రులుగా , కుటుంబ సభ్యులు గా పసి వారి భద్రత అందరి బాధ్యత . వారికి ఊహ తెలిసేవరకు వారి వెన్నంటే ఉండి నడిపించాలి . అప్పుడే మన ఇంట వారి  నవ్వులు విరబూస్తాయి . మన వెంట సంతోషాలు వెల్లువిరుస్తాయి.
******           ******             ******

మణి మాలిక ....తెలుగు పదాల చక్కని అల్లిక 


ఫేస్ బుక్ (facebook ) స్నేహ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఓ చక్కని వేదిక . ఐతే కొంతమంది ఈ వేదికను అభిరుచులును పంచుకోవడానికి , వారి లోని ప్రతిభ ను మెరుగు పరుచుకోవడానికి కూడా వాడుకుంటారు . ఒకే అభిరుచి గల వ్యక్తులు అందరూ ఓ బృదం గా ఏర్పడి ఆలోచనలు ....అభిప్రాయాలూ పంచుకుంటూ స్నేహ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు . కొన్ని బృందాలు సామాజిక సమస్యల పై చర్చలు జరిపితే .....మరికొన్ని విజ్ఞానం , వినోదం , కళలు , సాహిత్యం ఇలా అనేక అంశాలలో ఆలోచనలు పంచుకుంటున్నాయి . 

ఫేస్ బుక్ లోని ఒక చక్కని బృందం గురించి ఈ వారం తెలుసుకుందాం . ఈ బృందం పేరు " మణిమాలిక " ....మధుర భావాల అక్షర దీపిక . 

మణిమాలిక తెలుగు పదాల చక్కని అల్లిక .....అందమైన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చి ........ఆ అక్షరాలను చక్కని భావం తో అద్బుతం గా మలిచే ఓ చక్కని వేదిక . చిన్న చిన్న పదాలతో .....ద్విపాదా కవితలు ఈ మణి మాలికలు .ఏ వాక్యం లో  అయినా గరిష్టం గా ఆరు పదాలు మాత్రమే ఉండి , భావాన్ని సూటిగా చెప్తూ అలరిస్తాయి ఈ మాలికలు . మీరు ఇవి కూడా చదవవచ్చు 


ఈ బృంద సభ్యులు అంతా సాహిత్యం పట్ల అభిరుచి కలవారే . తెలుగు భాష పై మమకారం ఉన్నవారే . ఒకే అభిరుచి కల వారు ఒక చోట చేరితే ఎలా ఉంటుందో ...తెలియడానికి ఈ బృందమే ఒక చక్కని ఉదహరణ . ఈ బృంద సభ్యులు చక్కని పదాలతో ....మనసుకు హత్తుకునే భావాన్ని పలికిస్తున్నారు . ఒక మాలిక ఆనందాన్ని ఇస్తుంది ...... ఒక మాలిక ఆలోచనను రేకిస్తుంది ..........ఒక మాలిక చిలిపి తనాన్ని బయట పెడుతుంది ...........కానీ ప్రతీ మాలిక సున్నితమైన భావం తో మనసు లోతుల్లోకి చేరుతుంది . 

ఈ బృందం లో ని సభ్యులు ప్రతీ సిరా చుక్కకు ....ఓ ఆలోచనను జతపరిచి అమృత భిందువులు గా మారుస్తున్నారు . ఈ వేదిక పై అక్షరాలతో ఆడుకో గల కలం వీరులు ఉన్నారు . వీరు కొత్తగా ఈ బృందం లో చేరుతున్న వారికీ సూచనలు , సలహాలు ఇచ్చి ఈ మాలికల ప్రక్రియను నేర్పిస్తున్నారు . ప్రతీ వారం ప్రత్యేకం గా ఓ అంశం పై "మాలికలు " తో అలరిస్తున్నారు . వాటిలో ఉత్తమ మాలికలు ను ఎంపిక చేసి అభినందిస్తున్నారు . ఈ విధం గా బృంద సభ్యులు కు  ప్రోత్సాహం  ఇస్తూ ....మంచి మంచి మాలిక లు తో అందరినీ అలరిస్తున్నారు . ఈ బృందం  లో సుమారుగా ౩౩౦౦ మంది సభ్యులు ఉన్నారు . అందరూ ఎంతో క్రమ శిక్షణ తో బృంద నియమ నిబందనలు పాటిస్తూ ....మాలికలు పోస్ట్ చేస్తుంటారు . వీరు అంతా వివిధ రకాల వృత్తుల లో బిజీ బిజీ గా ఉన్నప్పటికీ తమ అభిరుచి కోసం సమయాన్ని కేటాయించుకుని మధురమైన మాలికలు ను అందిస్తూ ఉన్నారు . అప్పుడప్పుడు చిన్న చిన్న సభల ద్వారా కలుసుకుంటూ స్నేహ సామ్రాజ్యాన్ని కూడా విస్తరించికుంటున్నారు . 

ఈ బృందం లో ని కొన్ని మాలికలు ...........


కనుపాపల్లోనే నువ్వు ఉన్నండుకేనేమో ..........
మనసులో చీకటి ఉన్నా చూపుతో వెలుగుతున్నా . (  లక్ష్మీ రాధిక )

అక్షరాలు నా ప్రాణం ......
అక్షరాల్లో ఒదిగిన సరిగమలే నా ధ్యానం .    (అనుపమ రెడ్డి )

ముగిసిన కధ అనుకున్నా ....
మధురమైన మలుపుగా నువ్వు ఎదురవ్వక ముందు .....(లక్ష్మి యలమంచిలి )

గోరంత ఆనందాన్ని కొండంత చేసుకున్నప్పుడే అనుకున్నా ..!
ఆశగా పెంచుకున్న శూన్యం ఎప్పుడో నన్ను వెక్కిరిస్తుంది అని .    (దయానంద్ రావు )

కొన్ని గుండె గొంతుల తడారదేమో  !
ధన దాహామనే తీరని ఎడారి తనం లో .....!!   (U L నరసింహ గౌడ్ )

కరిగిపోతూనే ఉన్నా ....
నిత్యమూ నీ జ్ఞాపకాల కొలిమిలో ....!!  ( భారతి కాట్రగడ్డ )ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతీ మాలికా మనసుకు హత్తుకునేదే .......ఈ బృందం ఎప్పుడూ ఇలాగే మంచి మాలికలతో సాహిత్య ప్రియులు ను అందరినీ అలరించాలి అని కోరుకుందాం .(మణిమాలిక బృంద  ADMIN కు ధన్యవాదాలు తో )


డిజిటల్ మనీ                                             పెద్ద నోట్ల రద్దు దేశం లో పెను సంచలనాన్నే సృష్టించింది. నల్ల ధనాన్ని అరికట్టడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది . కారణాలు ఏమైనా కానీ  నోట్ల రద్దు తో సామాన్యులు చేతి లో నగదు లేక అష్టకష్టాలు పడుతున్నారు . ఈ కష్టాల బారి నుండి బయట పడడానికి ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం డిజిటల్ మనీ . చేతిలో నగదు కాగిత రూపం లో నగదు లేనప్పటికీ , మన బ్యాంకు ఎకౌంటు నుండి ఆర్దిక లావాదేవీలు నిర్వహించడం మే డిజిటల్ మనీ . నోట్ల రద్దు వెనుక ఉన్న కారణాలలో దేశాన్ని “నగదు రహిత” ఆర్దిక వ్యవస్థ గా మార్చడం కూడా ప్రభుత్వ ఆలోచన ఆని  ఆర్దిక నిపుణులు పేర్కుంటున్నారు .

                             చేతిలో నగదు లేనప్పటికీ డెబిట్ కార్డు లు , క్రెడిట్ కార్డు లు , ఇంటర్నెట్ బ్యాంకింగ్ , వాల్లెట్లు , మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ లు,  చెక్కు లు  ద్వారా ఆర్దిక లావాదేవీలు  సులభంగా నిర్వహించుకోవచ్చు . చిల్లర కష్టాల నుండి బయటపడవచ్చు . వీటి ద్వారా ఆర్దిక లావాదేవీలు ఏ విధంగా నిర్వహించుకోవచ్చు అనేది విపులంగా తెలుసుకుందాం .
డెబిట్ కార్డు /ఎటిఎం కార్డు లు  :  మన బ్యాంకు ఎకౌంటు లోని నగదును ఎటిఎం ల ద్వారా తీసుకోవడానికి బ్యాంకు లు ఎటిఎం కార్డు లను అందిస్తున్నాయి . వీటినే డెబిట్ కార్డు లు అని కూడా అంటారు. వీటి ద్వారా ఎటిఎం ల నుండి నగదు ను తీసుకునేవాళ్ళం . అలాగే వీటి ద్వారా దుకాణాలలో బిల్లులు చెల్లించవచ్చు . అక్కడ ఉండే బిల్ కౌంటర్ లోని వ్యక్తి కి ఈ కార్డు అందించి , మనం పెట్టుకున్న రహస్యసంఖ్య (password) ను అక్కడ ఉండే ఒక చిన్న యంత్రం లో నమోదు చేయడం ద్వారా మన బిల్లులను చెల్లించవచ్చు . మనం password ను నమోదు చేయగానే మన బ్యాంకు ఎకౌంటు నుండి బిల్ కు సరపడా  నగదు దుకాణాదారుని బ్యాంకు ఎకౌంటు కు బదిలీ అవుతుంది . క్రెడిట్ కార్డు లు ద్వారా కూడా ఇదే విధం గా లావాదేవీలు జరపవచ్చు . అలాగే online వెబ్సైటు లలో కొన్నప్పుడు కూడా ఆయా వెబ్సైటు లలో డెబిట్ కార్డు నెంబర్ , కార్డు మీద ముద్రించబడి ఉండే కార్డు చెల్లుబాటు అయ్యే చివరి నెల , సంవత్సరం , కార్డు దారుని పేరు , కార్డు వెనకాల ఉండే cvv నెంబర్ నమోదు చేయడం ద్వారా online లో చెల్లింపులు జరపవచ్చు .

ఇంటర్నెట్ బ్యాంకింగ్ /మొబైల్ బ్యాంకింగ్ :
ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే బ్యాంకు లు ప్రత్యేకంగా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకోవడానికి వెబ్ సైట్ ను రూపొందిస్తాయి . ఆయా బ్యాంకు ల వెబ్సైటు లలో మనకు కేటాయించిన USER ID , password లతో మన బ్యాంకింగ్ వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు . అలాగే బ్యాంకింగ్ వ్యవహారాల కోసం మొబైల్ అప్లికేషన్ లను బ్యాంకు లు అందిస్తున్నాయి . వీటి ద్వారా మన మొబైల్ లోనే బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు .
చెక్కులు : ఇవి ఎప్పటి నుండో అమలులో ఉన్నాయి . మనం ఎవరికి నగదు చెల్లించాలో వారి పేరు మీద చెక్కు వ్రాసి ఇస్తాం . వారు ఆ చెక్కు ను బ్యాంకు లో నగదు గా మార్చుకుంటారు .

వాల్లేట్ లు (WALLETS) :
నగదు బదీలికి మరో మార్గం మొబైల్ వాల్లేట్ లు . SBI BUDDY , PAYTM, FREECHARGE, ICICI POCKETS, MOBIKWIK, OXIGEN WALLET  వంటి ఎన్నో మొబైల్ వాల్లేట్ లు అందు బాటు లో ఉన్నాయి . వీటి ద్వారా నగదు ను ఒక వాల్లేట్ నుండి మరో వాల్లేట్ కు (అదే కంపెనీ వాల్లేట్ కు ) సులభంగా బదీలి చేయగలం . ఒక మొబైల్ వాల్లేట్ లో ఎవరికి ఐతే నగదు ను పంపుతున్నమో వారి మొబైల్ నెంబర్ ను నమోదు చేసి సులభంగా వారికి నగదు ను పంపవచ్చు . అలాగే వాల్లేట్ నుండి మన బ్యాంకు ఎకౌంటు కు , ఇతరుల బ్యాంకు ఎకౌంటు కు కూడా నగదు ను పంపవచ్చు . ఐతే మనం గుర్తు పెట్టు కోవలసిన విషయం నగదు ను పంపుతున్న వారికి , అందుకుంటున్న వారికి కూడా ఒకే రకమైన వాల్లేట్ ఉండాలి . దుకాణాలలో సరుకులు కొనుగోలు చేసినప్పుడు వాల్లేట్ ల ద్వారా నగదు ను చెల్లించవచ్చు .

ఈ వాల్లేట్ లు చిన్న చిన్న నగదు వ్యవహారాలకు  అనువైనవి . వెంటనే నగదు బదీలి చేయగలం . ఒక రహస్య సంఖ్య తో వాల్లేట్ ను బద్రపరుచుకోగలం .ఒక వాల్లేట్ నుండి మరో వాల్లేట్ కు ఎటువంటి రుసుములు లేకుండానే నగదు బదీలి చేయగలం . నెలకు కేవలం 20,000రూపాయల వరకు మాత్రమే నగదు వ్యవహారాలు చేయగలం . ఈ వాల్లేట్ ల వలన మన బ్యాంకు ఎకౌంటు వివరాలు ఎవరితో పంచుకోవాల్సిన అవసరం లేదు .

 ఎలక్ట్రానిక్ నగదు బదిలీ  పద్దతులు

మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎకౌంటు నుండి నగదు బదిలీ చేసేటప్పుడు మనకు NEFT/RTGS/IMPS/UPI వంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ విధానాలు  కనబడతాయి . వీటి గురించి విపులంగా తెలుసుకుందాం . NEFT (National Electronic Funds Transfer) పని దినాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు నగదు బదిలీ చేయగలం . ఈ విధానం లో నగదు బదీలీ చేసినపుడు నగదు బదిలీ కి ఒక గంట సమయం పడుతుంది . 2 లక్షల రూపాయల వరకు ఎంత నగదు ను ఐనా బదిలీ చేయవచ్చు . RTGS (Real Time Gross Settlement) ఈ విధానం లో కూడా నగదు ను పంపవచ్చు కానీ దీనికి కనిష్టం గా 2 లక్షల రూపాయలు ఉండాలి . పని దినాలలో 9 గంటల నుండి 4.౩౦ గంటల వరకు ఈ విధానం లో నగదు ను బదీలి చేయగలం .  IMPS (Immediate Payment సర్వీసెస్) ఈ విధానం లో నగదును రోజు లో ఎప్పుడైనా , సెలవు దినాలలో కూడా పంపవచ్చు . బ్యాంకు ఎకౌంటు నెంబర్ , ifsc కోడ్ లేదా బ్యాంకు ఎకౌంటు mmid, మొబైల్ నెంబర్ తెలిస్తే చాలు . (mmid అనేది imps విధానం కోసం ప్రతీ బ్యాంకు ఎకౌంటు కు ప్రత్యేకంగా కేటాయించిన నెంబర్ ). ఐతే ఈ విధానం లో రోజుకు గరిష్టం గా 50000 రూపాయల వరకు మాత్రమే బదిలీ చేయగలం . బ్యాంకు మొబైల్ అప్లికేషన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైటు లలో జెనరేట్ mmid అనే లింక్ క్లిక్ చేయడం ద్వారా మన బ్యాంకు ఎకౌంటు mmid తెలుసుకోగలం .
                   upi (Unified Payment Interface) ఈ పద్ధతి ద్వారా నగదు బదిలీ సులభతరం . ఏ బ్యాంకు లో ఎకౌంటు ఉన్నవారు ఐనా upi మొబైల్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని ఒక ప్రత్యేక గుర్తింపు నామాన్ని సృష్టించుకుని లావాదేవీలు జరపవచ్చు . ఉదాహరణకు రాజేష్ కు icici బ్యాంకు లో ఎకౌంటు ఉన్నా , andhrabank లేదా ఇతర బ్యాంకు ల upi అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని తన పేరుతో rajesh@andhrabank అనే ఒక గుర్తింపు నామం తో లావాదేవీలు జరపవచ్చు . andhrabank upi అప్లికేషన్ ద్వారా లావాదేవీలు జరిపినా నగదు rajesh icicibank ఎకౌంటు లోనే జమ అవుతుంది . ఇతరులకు నగదు పంపేటప్పుడు వారి ప్రత్యేక నామం ఉంటె చాలు బ్యాంకు ఎకౌంటు నెంబర్ , ifsc కోడ్ వంటి వివరాలు అన్నీ అందించ వలసిన అవసరం లేదు . ఐతే ఒక్క sbi గ్రూప్ బ్యాంకు లు ఈ నెట్వర్క్ లో చేరలేదు . కాబట్టి sbi group బ్యాంకు లు లో ఎకౌంటు ఉన్నవారు upi విధానాన్ని వాడలేరు .  
ఏ విధానం లో డిజిటల్ చెల్లింపులు చేసినా కొన్ని జాగ్రత్త లు తీసుకోవాలి . ఎంతో బద్రత తో రహస్య సంఖ్య (password) ఉన్నప్పటికీ ఏమాత్రం అజాగ్రత్త తో ఉన్నా ముప్పు పొంచి ఉంటుంది .
·         నెట్ బ్యాంకింగ్ , మొబైల్ బ్యాంకింగ్ , వాల్లేట్ లు యొక్క రహస్య సంఖ్య (password )ఎవరకీ చెప్పకూడదు . * కొన్ని బ్యాంకు లు మొబైల్ కి సంక్షిప్త సందేశాలు రూపం లో వన్ టైం password (otp) ను పంపుతాయి వీటిని కుడా ఎవరితో పంచుకోకూడదు . * నగదు బదిలీ చేసేటపుడు ఎకౌంటు నెంబర్ నమోదు చేసేటప్పుడు జాగ్రత్త గా సరి చూసుకోవాలి . *ఒక్కసారి తప్పుగా ఎంటర్ చేసి నగదు పంపితే తరువాత మన డబ్బుల కోసం చాల ఇబ్బందులు పడవలసి వస్తుంది . * ఫోన్ చేసి బ్యాంకు అధికారులమని చెప్పి బ్యాంకు ఎటిఎం కార్డు నెంబర్ పిన్ నెంబర్ వంటివి అడుగుతారు ఈ వివరాలు ఎవరకీ చెప్పకూడదు . బ్యాంకు అధికారులు ఎప్పుడూ కూడా ఇలాంటి వివరాలు అడగరు . మీకు అంత గా అనుమానం ఉంటె బ్యాంకు లో నేరుగా సంప్రదించండి . * ఇంటర్నెట్ సెంటర్ ల నుండి online బ్యాంకింగ్ చేయకపోవడం ఉత్తమం  *
కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే మోసగాళ్ళ బారిన పడకుండా డిజిటల్ లావాదేవీలు  సులభంగా జరుపుకోవచ్చు .గిరిజన నృత్యం ........దింస                      అరకు అంటేనే ప్రకృతి అందాలు . ఎత్తైన కొండలు . ఆ కొండలు పై నుండి జాలువారుతున్న పిల్ల ధారలు . కనువిందు చేసే లోయలు . ప్రకృతి పచ్చ చీర కట్టినట్టు ఉండే పచ్చని చెట్లు . పసుపు వర్ణం లో పరుచుకున్న అవిసె పూలు . చల్లటి గాలి తిమ్మెరలు . ఈ ప్రకృతి  తో మమేకమై జీవించే అమాయక గిరిజనులు . ఆ అందాలు ను చూడాలే కానీ ఎంత వర్ణించినా తక్కువే .ఈ ప్రకృతి అందాలు తో పోటీ పడుతూ  ఇక్కడి గిరిజనులు చేసే నృత్యాలు , మన కనుపాప ఒకసారైన చూసి తీరాలి .   
అరకు లోయ లో దింస నృత్యం చేస్తున్న గిరిజనులు

                      ఇక్కడి గిరిజనుల సంప్రదాయమైన నృత్యాలలో ప్రధానమైనది దింస. వాల్మీకులు, బగతలు, కోటియా, ఖోండ్, కొలాములు, మూఖ దొరలు లాంటి సుమారు 18 తెగలకు చెందిన గిరిజనులు ఈ సంప్రదాయ నృత్యంలో పాల్గొంటారు. ఒరిస్సా లోని కోరాపుట్ జిల్లా ఖోండ్ తెగ గిరిజనులకు పుట్టిల్లు వంటిది .  కోరాపుట్ జిల్లా లోని పల్లెలలో ఈ దింస నృత్యం ప్రారంభం ఐయ్యినట్టు చరిత్ర కారుల అభిప్రాయం . విశాఖ పట్నం , విజయనగరం ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే గిరిజన తెగలు వారి ఆచార సంప్రదాయాలలో ఒక బాగంగా దింస  మమేకం ఐపోయింది . పండగలు, జాతరలు లోను, పెళ్ళిళ్ళు వంటి శుభ కార్యాలలోను, సంప్రదాయ వేడుకలలోను ఆడా, మగా, చిన్న, పెద్ద తేడాలు లేకుండా గిరిజనులందరూ సామూహికంగా ఈ దింస నృత్యంలో పాల్గొంటారు.
                           చైత్రమాసంలో పెద్దదేవర పండుగ, ఆగస్ట్ లో బాలిదేవర పండగ, నవబరులో దీపావళి పండగ, జనవరి నెలలో సంక్రాంతిలో పంటల పండగ, ఆ తదుపరి నందిదేవుని పండగ. మద్య మద్యలో వచ్చే పెళ్లి పండగలు, సంప్రదాయ వేడుకలు ఇలా ఏడాదంతా గిరిజనులకు పండగలే.
                 పండగ అంటే నృత్యాలే. నృత్యమంటే ధింస నే. దింస నృత్యం చేసే వారికి వయస్సుతో పట్టింపు ఉండదు. గిరిజన బాలబాలికలు, యువతీ యువకులు, స్ర్తిలు, పురుషులు కలిసి మెలసి సామూహికంగా ఆడతారు. ఈ ఆట అందరూ కలిసి ఉండాలి అనే ఒక సందేశాన్ని ఇస్తుంది . ఈ సందేశం వీరి జీవన విధానం లో ప్రస్పస్ట్టం గా కని పిస్తుంది .  ఇలాగే నర్తించాలనే నియమిత నియమం ఉండదు. సామూహికంగా జట్టుకట్టడం అనేది ఆనవాయితి. పండగ సందర్భం ఈ జట్లని నిర్ణయిస్తాయి. సాధారణంగా 15 నుంచి 20 మంది గిరిజన స్త్రీ పురుషులు కలసికట్టుగా వలయాకారంలో తిరుగుతూ, చేతులు, పాదాలు లయబద్దంగా కదుపుతూ ఈ నృత్యం చేస్తారు. సుమారు 10 నిమిషాలపాటు ఈ నృత్యం కొనసాగుతుంది. నృత్యంలో పాల్గొనే గిరిజన స్త్రీ పురుషులు పొడుగాటి వరుసలో బారులు తీరి, వీపు వెనుక నుంచి చేతులు పోనిచ్చి ఒకరి నడుమును ఇంకొకరు పట్టుకొంటూ లయబద్దంగా అడుగులు వేస్తుంటే, మరో పక్క బారు లోని రెండు కొనలలో వున్న వ్యక్తులు అడుగులు ముందుకు వేస్తూ కలుసుకొంటూ, విడిపోతుంటారు. మిగిలిన ఆడా మగా కలసి లయబద్దంగా వలయాలు చుడుతూ, మెలికలు తిరుగుతూ నర్తిస్తారు. ఈ నృత్యం చేస్తున్న గిరిజనులను జోడు కొమ్ము బూరలను ఊదుతూ, డప్పు మోగిస్తూ సంగీతంతో ఉత్తేజపరుస్తారు. ఎంతో శోభాయమానంగా, లయబద్దంగా సాగే దింసా నృత్యాన్ని తిలకిస్తున్న మనకు సైతం  ఆ నర్తించే జట్టుతో కలిసి అడుగులు వేయాలని మనసు ఆరాట పడుతుంది .
పాట తప్పనిసరి కాదు

                దింస నృత్యాలలో పాట తప్పనిసరి కాదు. కాని సంగీతం మాత్రం తప్పని సరి. ఈ సంగీతం లేకపోతే నృత్యం లేదు. దింస లోని నృత్యాన్ని బట్టి ఒకో రకమైన సంగీతం ఉంటుంది .  ఈ సంగీతం గిరిజన సమాజం, జీవితం, భౌగోళిక స్థితులపై ఆధారపడి రూపొందింపబడింది. డప్పు, గిరిజన డోలు, మోరి, కిరిది, తుడుము, జోడు కొమ్ములు మొదలైనవి ధింసా నృత్యానికి సంగీత వాద్యాలుగా ఉంటాయి. ఉదాహరణకు ఆరుగురితో వున్న ఒక జట్టు చేసే దింస నృత్యంలో ఆరు సంగీత వాద్యాల్ని ఏక కాలంలో వాయిస్తారు. సాధారణంగా సంగీతవాద్యాలను పురుషులు వాయిస్తుంటే స్త్రీలు నర్తించడం జరుగుతుంది. నృత్యంలో పాల్గొనే గిరిజన స్త్రీ పురుషులు ఇరువురూ సాంప్రదాయకమైన ఆభరణాలను, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ వంటి విలక్షణమైన రంగు రంగుల దుస్తులను ధరిస్తారు. స్త్రీలు చీరలను మోకాలి క్రింద వరకూ మాత్రమే ధరిస్తారు. నృత్యంలో ప్రధాన నాయికా, నాయకులు నెమలి ఈకలను చేతులలో ధరిస్తారు.
ధింసా లో ఎన్నో రకాలు

                       ఈ నృత్యం లో ఎన్నో రకాలు ఉన్నాయి . చూసేవారికి అన్ని నృత్యాలు ఒకేలా అనిపిస్తాయి . కానీ ఇందులో సుమారు పదిహేను రకాల నృత్య రీతులు ఉన్నాయి . ఒక్కో రకం నృత్యానికి ఒక్కో  ప్రయోజనం ఉంది .బోడా దింస, గుండేరి దింస, గొడ్డి బేటా దింస, పోతర్ తోలా దింస,భాగ్ దింస,నాటికారి దింస,కుండా దింస, బాయా దింస వంటి పేర్ల తో ఈ నృత్య రీతులను పిలుస్తారు . ప్రతీ నృత్యం చిన్న చిన్న మార్పులతో అలరిస్తుంది .  సమయం ని బట్టి ,  ,  సందర్భం ని బట్టి ఒక్కో నృత్యం చేస్తారు . ప్రతీ నృత్యం లో వీరి జీవన విధానం, ఆచార సంప్రదాయాలు అంతర్లీనం గా కనబడుతూ ఉంటాయి .

 

 

 

బోడా దింస (పెద్ద నృత్యం)

గిరిజన గ్రామ దేవత (నిసాని దేవత) లను పూజిస్తూ సామూహికంగా ఈ నృత్యం చేస్తారు. ఉధృతమైన వాయిద్య హోరుతో బోడా దింసా నృత్యం ప్రారంభమవుతుంది. కుడివైపు మగవాళ్ళు, ఎడమవైపు ఆడవాళ్ళు ఒక పెద్ద వరుసలో బారులు తీరి, వీపు వెనుక నుంచి చేతులు పోనిచ్చి ఒకరి నడుమును ఇంకొకరు పట్టుకొంటారు. కుడి వరుస లోని చివరికొసలో వున్న పురుషుడు (నెమలి ఈకల పించాన్ని పట్టుకొన్న కథా నాయకుడు), ఎడమ వరుసలోని చివరికొసలో వున్న స్త్రీ (కథానాయకి) లయబద్దంగా అడుగులు వేస్తూ ముందుకు వచ్చి కలుసుకొంటారు. అప్పుడు మిగిలిన నృత్యకారులంతా పాముల వలె మెలికలు తిరుగుతూ, వర్తులాకారంగా తిరుగుతూ మద్య మద్యలో హుయ్, హేయ్ మని ఆనందాతిశయంతో అరుస్తూ తిరిగి మళ్ళీ తమ తమ వరుసలలో చేరిపోతారు. గిరిజన పల్లెలలో జనవరి నెలలో సంక్రాంతి సమయంలో ఈ నృత్యం చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. విశేషాదరణ పొందిన గిరిజన నృత్యం ఇది.

 

 

గుండేరి దింసా (పక్షి నృత్యం)

దీనినే ఉస్కు దింసా అని కూడా పిలుస్తారు. గుండేరి అనేది ఒక స్త్రీ పేరు. ఒక వరుసలో వున్న పురుషులు, మరో వరుసలో వున్న స్త్రీలను తమతో కలసి నృత్యం చేయమని పిలుస్తున్న అర్ధంలో ఒక పాటను పాడుతూ స్త్రీ వరుసలో వున్న వాళ్ళను ఆహ్వానిస్తారు. అందువల్లనే ఈ నృత్యాన్ని గుండేరి దింసా నృత్యం అంటారు. స్త్రీ పురుషులిద్దరూ కలసి పక్షులను అనుకరిస్తూ లయబద్దంగా వలయాలు చుడుతూ, ఉద్రేకపూరితంగా చేసే నృత్యమిది.

 

గొడ్డి బేటా దింసా (రాళ్ళను ఏరే నృత్యం)

ఒరియా భాషలో గొడ్డి అంటే చిన్న రాళ్ళు. బేట అంటే ఏరుట అనే అర్థం. తలలు క్రిందకు దించి పైకి ఎత్తుతూ, రాళ్ళు, రెమ్మలు ఏరుతున్నట్లు అనుకరించే నృత్యం ఇది. మంచి వూపుతో ముందుకు వంగుతూ లేస్తూ సుమారు 25 అడుగుల దూరం ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి, అలా నాలుగైదు సార్లు ఆవర్తించడం ఈ నృత్యంలో విశేషం.

 

పోతర్ తోలా దింసా (ఆకులను సేకరించే నృత్యం)

పోతార్ అంటే ఆకులు, తోలా అంటే సేకరణ. అడవిలో ఆకుల్ని కోస్తున్నట్లు, ఏరుతున్నట్లు అనుకరించే నృత్యం. ఇది అరకు లోయలో గిరిజనుల అడ్డ ఆకులను సేకరించే వృత్తిని సూచిస్తుంది. రెండు వరుసలలో ఒకదాని వెంట మరొకటిగా సాగుతుంది. ముందు వరుస మనుష్యుల భుజాలమీద వెనుక వరుస మనుష్యులు చేతులు వేసి తలల్ని పక్కలకు కదుపుతూ, ముందుకూ వెనక్కూ అడుగులు లయబద్దంగా కదపడం ఈ నృత్యం లోని విశేషం.

 

భాగ్ దింసా (బెబ్బులి నృత్యం)

భాగ్ అంటే ఒరియాలో బెబ్బులి అని అర్థం. అడవిలో సంచరించడం గిరిజనుడికి ఎంత సహజమో, గిరిజనుడికి పులి ఎదురుపడటం కూడా అంతే సహజం. అలాంటి సందర్భంలో పులి ఎదురుపడినప్పుడు ఒక వేటగాడు ఎలా తప్పించుకొని పోవాలి అన్న విషయాన్ని తెలుపుతూ పులి-మేకను అనుకరిస్తూ చేసే నృత్యం ఇది. బృందంలో సగం మంది ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుండ్రంగా మూగుతారు. తలను పై కెత్తుతూ ముని వేళ్ళ మీద నిలిచి వుంటారు. మిగతా సగం మంది చకచకా చుట్టు తిరుగుతూ లోపల ప్రవేశించి, పాము చుట్ట ఆకారంలో అంతా పరుచు కుంటారు. ఇలా అనేక సార్లు చేస్తారు. జంతువుల వేట వంటి అంశాలను నేర్వడం కోసం, వాటి సాధన కోసం ఈ నృత్యాలను రూపొందినట్లు తెలుస్తుంది. సామాజిక అవసరాల వ్యక్తీకరణలో భాగంగా ఇటువంటి నృత్యాలను గిరిజనులు సాధన చేస్తారు.

 

   నాటికారి దింసా (నాట్య కార్యం)

దీపావళి రోజున ఒకే ఒక వ్యక్తి చేసే నృత్యం ఇది. ముఖ్యంగా వాల్మీకులు దీనిని చేస్తారు. ఇతర తెగలు కూడా ఇతర పండుగ సందర్భాలలో దీనిని చేస్తారు.

 

 

కుండా దింసా (భుజాల తోపుడు)

కుండా అంటే ఒకరి నొకరు భుజాలతో తోసుకోవడం అని అర్ధం ఈ నృత్యంలో నర్తించే వాళ్ళు పక్కలకు ఊగుతూ, తమ భుజాలతో పక్క వాళ్ళను తోయడం ప్రత్యేక లక్షణంగా వుంటుంది.

బాయా దింసా (అతీత భావన నృత్యం)

బాయా అంటే పూనకం. గిరిజన పల్లెలోని పూనకం పట్టిన గణాచారి చేసే నృత్యం ఇది. మతపరమైన ఈ గిరిజన నృత్యంలో గణాచారి తనను దేవతలు పూనటాన్ని సూచిస్తూ లయాత్మకంగా ఊగుతూ ఈ నృత్యం చేస్తాడు. ఈ పూనకపు నృత్యం జరుగుతున్నంతసేపు అతని చుట్టూ మూగిన గిరిజనులు తలలు వంచి వినమ్రులై వుంటారు.
ఇవేకాక ఆయా ప్రత్యేక సందర్భం బట్టి పోతార్ తోటి (పులి నృత్యం), సాంబారీ ధింసా (కణుజు నృత్యం), పోషీచశానా ధింసా (యువతీ యువకుల నృత్యం), రంగోబోతి ధింసా (ఆనంద నృత్యం), చోటీ ధింసా (హాస్య నాట్యం), సోలారి దింసా (ఆత్మీయ నృత్యం), బీబా ధింసా (వివాహ నృత్యం) కమ్మర చెక్కి ధింసా (కమ్మరిపని నృత్యం) మొదలగు రకాలతో కూడిన దింసా నృత్యాలు చేస్తారు.

                     మారుతున్న పరిస్థిస్తులు మానవ లోకాన్ని మనీ లోకం గా మారుస్తుంటే ......ఈ ఆర్ధిక కోణాల చూపు దింస పైన పడింది . ఈ గిరిజనుల జీవన విధానం లో ఒకటైన దింస నేడు వీరి ఆకలి తీర్చే అమ్మ గా మారింది . ఒకప్పుడు వినోద కారకంగా , పండుగలలో వేడుకలలో నర్తించిన వీరు , నేడు కడుపు నింపుకోవడం కోసం బృందాలు గా ఏర్పడి పర్యాటకులు ముందు , సాంస్కృతిక కార్యక్రమాలలో ను నర్తిస్తున్నారు . ఈ సామాజిక సాముహిక కళ ను ఆర్ధిక కోణం లో చూడడం భాదకరమే . 

 

 

 

 

 

 

                                                                                               


చిహ్నం చెప్పే సంగతులు 

వినియోగదారులు అందరు కూడా తము కొనుగోలు చేసే వస్తు సేవలు నాణ్యత తో ఉండాలని భావిస్తారు . నాణ్యత కోసం ఎంత ఖరీదు ఐనా ఆలోచించరు. కానీ ఒక్కోసారి నాణ్యత లోపించిన వస్తు సేవలు ను కొనుగోలు చేసి విచారించే సంధర్బాలు ఉంటాయి . 


మనం కొనుగోలు చేసే వస్తు సేవలు నాణ్యత తెలుసుకోవడం ఎలాగ ? కొన్ని రకాల వస్తువులు , సేవలకు వాటి నాణ్యత ను పరిశీలించి కొన్ని సంస్థలు వాటికి “నాణ్యమైనవాటిగా “ గుర్తింపు పత్రాన్ని అందిస్తాయి . ఇలా గుర్తింపు పొందిన వస్తు సేవలు ఒక ప్రత్యేకమైన చిహ్నం తో లభిస్తాయి . ఆయా వస్తువులు ను బట్టి చిహ్నాలు ను గమనించి వాటిని కొనుగోలు చేయవచ్చు . అలాగే కొన్ని రకాల ఆహార పదార్ధాలు ను గుర్తించడానికి ప్రత్యేకమైన చిహ్నాలు ఉన్నాయి .


                   ఒక్కో చిహ్నం ఒక్కోసంగతి 
చెపుతుంది. మనం కొనుగోలు చేసే వస్తు సేవలు 
యోక్కనాణ్యత గుర్తించాలంటే ఈ చిహ్నాలు ను 
గమనిస్తే సరిపోతుంది. వీటిని అయావస్తువులు

 ను బట్టి వివిధ రకాల పేర్ల తో పిలుస్తారు . 
మీరు ఇవి కూడా చదవ వచ్చు                 ISI MARK  భారత దేశం లో పారిశ్రామిక ఉత్పత్తులు యొక్క నాణ్యత ను గుర్తించి “నాణ్యమైన వాటిగా “ తెలపడానికి ఈ చిహ్నాన్ని వాడతారు .BIS(Bureau of Indian Standards) అనే సంస్థ నాణ్యమైన వాటిగా గురించిన వస్తువులకు ఈ చిహ్నాన్ని జరీ చేస్తుంది . ISI MARK భారత దేశం లో బాగా గుర్తింపు పొందిన చిహ్నం . ISI అంటే INDIAN STANDARDS INSTITUTE. దీనినే ఇంతకముందు Bureau of Indian Standards అని పిలిచేవారు . వస్తు ఉత్పత్తి దారులు స్వచ్ఛందంగా తమ ఉత్పత్తులు లు ను పరిశీలించి ISI చిహ్నం జారీ చేయవలసింది గా BIS ను కోరవచ్చు . ఐతే దేశ ప్రజల భద్రత , ఆరోగ్యం  దృష్ట్యా కొన్ని వస్తువులకు BIS సర్టిఫికేషన్ తప్పనిసరి . చిన్న పిల్లల ఆహరం, విద్యుత్ వస్తువులు, గ్యాస్ సంభందిత వస్తువులు మొదలగు వాటిని  BIS తప్పనిసరిగా పరిశీలించి గుర్తింపు ని ఇస్తుంది . పరిశ్రమ లోని వస్తువుల సాంపిల్స్ ను పరిశీలించి , నిభందనలకు అనుగుణంగా వాటి నాణ్యత ఉంటె ఈ చిహ్నాన్ని జారీచేస్తుంది . కాబట్టి వస్తువులు ను కొనుగోలు చేసేటప్పుడు ISI చిహ్నాన్ని పరిశీలించి నాణ్యమైన వస్తువులు ను కొనుగోలు చేయవచ్చు .


        సిల్క్ మార్క్  భారతదేశం లో పట్టు వస్త్రాల నాణ్యత ను తెలియ చేసే చిహ్నం . CENTRAL SILK BOARD OF INDIA  ఏర్పాటు చేసిన  SILK MARK ORGANISATION  నాణ్యమైన పట్టు ఉత్పత్తులను పరిశీలించి ,నాణ్యమైన వాటిగా గుర్తించి “సిల్క్ మార్క్” చిహ్నాన్ని జారీ చేస్తుంది . వంద శాతం నాణ్యమైన, స్వచ్ఛమైన సిల్క్‌(పట్టు)ను కొనుగోలు చేయాలంటే దుస్తులపై సిల్క్‌మార్క్‌ లేబుల్‌  గమనించాలి . దానిపై సీరియల్‌ నెంబర్‌, సిల్క్ మార్క్   గుర్తు, చిరునామా తదితర వివరాలు ఉంటాయి. ఇలా ఉంటే నమ్మకమైందిగా గుర్తించి కొనుగోలు చేయవచ్చు.
              హాల్ మార్క్ అనేది విలువైన వస్తువుల (ప్లాటినం, బంగారం మరియు  వెండి ) మీద అధికారకంగా వేసేముద్ర. బ్యూరోఆఫ్ ఇండియన్ స్టాండర్స్ నుంచి హోల్‌మార్కు పొందిన నగలను స్వచ్ఛమైనవిగా బావించవచ్చు . వ్యాపారులు తయారుచేసిన నగలను బీఐఎస్‌కు పంపిస్తే 91.6 ఉంటేనే స్వచ్ఛత కలిగిన హాల్‌మార్క్ బంగారంగా గుర్తిస్తారు. అంతేకాదు బంగారం కరిగించిన తరువాత 91.6 స్వచ్ఛతగా ఉండాలి. మిగతా 8.04 శాతం సిల్వర్, ఇతర లోహాల మిశ్రమం ఉండాలి. కొంత మంది వ్యాపారులు 75, 80 శాతం హాల్‌మార్క్ అంటూ నగలు అమ్ముతుంటారు. అలా కాకుండా 100 హాల్‌మార్క్ నగలను మాత్రమే కొనాలి. కాగా 91.6 బంగారాన్ని ఇప్పుడు వాడుకలో 916గా పిలుస్తున్నారు.  బంగారం వెండి కొనుగోలు చేసేటప్పుడు హాల్ మార్క్ ను తప్పనిసరి గా  పరిశీలించాలి. హాల్ మార్కింగ్ వల్ల ఆ jewelers విక్రయించే వస్తువులు (బంగారం, వెండి) మొదలైనవి ఖచ్చితమైన నాణ్యత మరియు ప్రమాణాలు కలిగి ఉంటాయి .

కేడీఎం అంటే..
కేడీఎం అంటే కాడ్మియం అనే లోహం. బంగారానికి పూర్వం ఆలాం అనే లోహంతో నగలకు అతుకులు వేసే వారు. అయితే అది బంగారంలో కలిసిపోయేది. దాంతో బంగారం స్వచ్ఛత తగ్గుతూ వచ్చేది. దీంతో కాడ్మియంతో నగలకు అతుకు వేస్తున్నారు. అది బంగారంలో కలవదు.. నగల నాణ్యతా తగ్గదు. అలాగే 22,24 క్యారెట్స్ విషయంలో కూడా జాగ్రత్త అవసరం..బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) నుంచి హాల్‌మార్క్ పొందిన నగలను స్వచ్ఛమైనవిగా గుర్తిస్తారు. వ్యాపారులు తయారుచేసిన నగలను బీఐఎస్‌కు పంపిస్తే 91.6 ఉంటేనే స్వచ్ఛత కలిగిన హాల్‌మార్క్ బంగారంగా గుర్తిస్తారు. అంతేకాదు బంగారం కరిగించిన తరువాత 91.6 స్వచ్ఛతగా ఉండాలి. మిగతా 8.04 శాతం సిల్వర్, ఇతర లోహాల మిశ్రమం ఉండాలి. కొంత మంది వ్యాపారులు 75, 80 శాతం హాల్‌మార్క్ అంటూ నగలు అమ్ముతుంటారు. అలా కాకుండా 100 హాల్‌మార్క్ నగలను మాత్రమే కొనాలి. కాగా 91.6 బంగారాన్ని ఇప్పుడు వాడుకలో 916గా పిలుస్తున్నారు.


      శాఖాహార చిహ్నం / మాంసాహార చిహ్నం -  భారతీయ ఆహార భద్రత ప్రమాణాల చట్టం ను అనుసరించి భారతదేశం లో అమ్మే నిల్వచేసే (Packaged food) ఆహార ఉత్పత్తులు కు ఆయా పదార్దాలు ను బట్టి తప్పని సరిగా   శాఖాహార లేదా మాంసాహార చిహ్నం ముద్రించి ఉండాలి . శాఖాహారం ఐతే ఆకుపచ్చని రంగులో చుక్కని, మాంసాహారం ఐతే చామనచాయ (BROWN) రంగు లో చుక్కని ముద్రించాలి . ఈ చిహ్నాలని బట్టి ఆయా ఉత్పత్తులు శాఖాహారం మా లేదా మాంసాహారమా అనేది గుర్తించవచ్చు .

              అగ్ మార్క్ -  నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు ను అగ్ మార్క్ ద్వారా గుర్తించవచ్చు . అలాగే పళ్ళ రసాలతో తయారు చేసే ఉత్పత్తులకు FPO మార్క్ ను గమనించాలి . మినిస్ట్రీ అఫ్ ఫుడ్ ప్రోస్సింగ్ శాఖ ఈ చిహ్నాన్ని నాణ్యమైన ఉత్పత్తులకు జారీ చేస్తుంది . అలాగే ఆయుర్వేద ఉత్పత్తుల కు అయుష్ మార్క్ ను క్వాలిటీ కంట్రోల్ అఫ్ ఇండియా జారీ చేస్తుంది . ఆయుర్వేద ఉత్పత్తుల నాణ్యత ను దీని ద్వారా తెలుసుకోవచ్చు . పురుగు మందుల లో ఎంత శాతం విషపూరిత పధార్దాలు ఉన్నాయి అనేది Toxicity  చిహ్నాలు ద్వారా తెలుసుకోవచ్చు . వీటిలో ఎరుపు, పసుపు, నీలం , పచ్చ రంగుల ద్వారా పురుగు మందుల లోని విషపూరిత ప్రభావం ఎంత శాతం అనేది తెలుసుకోవచ్చు . కొన్ని ఉత్పత్తుల మీద ఉండే ఎకో మార్క్ ద్వారా ఆయా పదార్దాల తయారీలో పర్యావరణం కి హాని తలపెట్టలేదని తెలుసుకోవచ్చు . పర్యావరణ  హితం ఐన వస్తువులు ఎకో మార్క్ ద్వారా గుర్తించవచ్చు .


ఇలా ఆయా ఉత్పత్తులు సేవలు కొనుగోలు 
చేసేటప్పుడు చిహ్నాలను 
గమనించి నాణ్యమైన వస్తువులును కొనుగోలు 
చేయవచ్చు . చిహ్నాలు
 గమనించే ముందు చిహ్నం తో పాటు, ఆయా 
సంస్థలు జారీచేసిన 

గుర్తింపు సంఖ్య ను కూడా గమనించాలి. నకీలీ 


చిహ్నాలతో లేదా అసలు చిహ్నాలను పోలివుండే చిహ్నాలతో జాగ్రత్త అవసరం . అనుమానం 

వచ్చినప్పుడు చిహ్నాలు జారీ చేసే సంస్థలు ఇచ్చిన 
గుర్తింపు సంఖ్య తో 
ఆయా వెబ్సైటు లలో విచారించవచ్చు . 


    online లో EC ఎలా తీసుకోవాలి ?


                మన ఆస్తులు అంటే ఇల్లు ,స్థలాలు వంటివి మనం కొనుగోలు చేసేటప్పుడు మన పేరు మీద రిజిస్టర్ చేసుకుంటాం . రిజిస్ట్రేషన్ శాఖ రికార్డ్స్ లో మన పేరు మీద ఆ ఆస్థి ఉన్నట్టు నమోదు చేయించు కుంటాం . అలాగే మనం అమ్మేటప్పుడు కొనుగులు దారులు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాం . ఐతే రిజిస్ట్రేషన్ శాఖ రికార్డ్స్ లో ఆస్థి ఎవరి పేరు మీద ఉంది ? ఇంతకు ముందు ఎంత మంది నుండి ఎలా చేతులు మారి వచ్చింది . ? ఆ ఆస్థి ప్రభుత్వానికి చెందినదా ? లేక ఆస్థి తనఖా లో కానీ ఉందా అనే అంశాలు తెలుసుకోవాలంటే Encumbrance certificate (ec) ఉండాలి . ఈ పత్రం లో పైన చెప్పబడిన వివరాలు అన్నీ విపులంగా ఉంటాయి . మరి ఈ పత్రాన్ని పొందడం ఎలా ?

చాలా మంది కి ఈ పత్రం ఎలా పొందాలి ? ఆస్థులు కొనుగోలు చేసేటప్పుడు మనకు అవసరం ఐనా వివరాలు ఎలా తెలుసుకోవాలో తెలియక చాలా సందర్భాలలో మధ్యవర్తుల మీద ఆధార పడుతూ ఉంటాం . ఐతే ఇప్పుడు online లో మనకు కావలిసిన సమాచారాన్ని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అందుబాటులో ఉంచింది . దీని ద్వారా ఎవరైనా ఈ సమాచారాన్ని పొందవచ్చు .  

ఈ సమాచారాన్ని ఏ వెబ్సైటు ద్వారా ఎలా పొందవచ్చు అనేది ఈ వ్యాసం లో విపులంగా వివరిస్తాను . ఈ వ్యాసం పై ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో పొందుపరచండి . లేదా editor.teluguwebsite@gmail.com కు మెయిల్ చేయండి . మీ సందేహాలు ఉచితంగా తీరుస్తాం . 

Encumbrance certificate పొందడానికి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా లో ఒకే పద్ధతి అమలులో ఉంది . encumbrance certificate కోసం ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం లో సంప్రదించి పొందే వారు . ఇప్పుడు eseva కేంద్రాల ద్వారా పొందడానికి అవకాశం ఉంది . ఐతే మనం eseva కేంద్రానికి వెళ్ళకుండానే online లో ఈ పత్రం పొందడానికి తెలంగాణా రాష్ట్రానికి కి చెందిన సమాచారం కోసం   www.registration.telangana.gov.in , అదే ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన సమాచారం కోసం www.registration.ap.gov.in అనే వెబ్ సైట్ ల ద్వారా పొందవచ్చు . 

ఈ వెబ్ సైట్ లు రెండూ ఒకే విధంగా ఉంటాయి . వేటిలో ఏవిధంగా ec సమాచారం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం .

వెబ్ సైట్ హోం పేజి ని మనం పైన ఉన్న చిత్రం లో చూడవచ్చు . వెబ్సైటు లో కి వెళ్ళగానే మనకు ఈ విధం గా కనపడుతుంది . రైట్ సైడ్ మెనూ లో సర్వీసెస్ అనే పేరు కింద గా మనకు Encumbrance search (EC) అనే ఆప్షన్ కనపడుతుంది . దీని పై క్లిక్ చేయాలి . ఇప్పుడు మనకు క్రింది విధం గా ఒక పేజి  మనం ఎలా search చేయాలి అనే వివరాలతో కనపడుతుంది . ఏ పేజి లో చివర గా కనపడే submit అనే buton క్లిక్ చేయాలి . 
తరువాత మనకు encumbrance search అనే ఒక పేజి కనబడుతుంది . దీనిలో search creteria అని సేల్ డీడ్ నెంబర్ , రిజిస్ట్రేషన్ ఇయర్ ఇవ్వడానికి బాక్స్ లు కనపడతాయి . ఈ క్రింది చిత్రం గమనించండి . మొదటి బాక్స్ లో deed no అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి . తరువాత రెండవ బాక్స్ లో sale deed రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి . తరువాత బాక్స్ లో రిజిస్ట్రేషన్ జరిగిన ఇయర్ ఎంటర్ చేయాలి . తరువాత రిజిస్ట్రేషన్ ఆఫీస్  పేరు ఎంటర్ చేసి submit button క్లిక్ చేయాలి  . ఒక సారి  ఈ క్రింది చిత్రం చూడండి 


ఇప్పుడు మనకు కనపడుతున్న next అనే లింక్ మీద క్లిక్ చేయాలి . 

ఇప్పుడు మనకు encumbrance search అనే ఒక పేజి క్రింది విదంగా కనపడుతుంది . ఈ పేజీ లో మనం ఇచ్చిన deed number , year సరి చూసుకుని submit button క్లిక్ చేయాలి . 

తరువాత పేజి లో మనకు సేల్ deed numbers , వాటి లింకి డాక్యుమెంట్ నంబర్స్ కనపడతాయి . వీటి అన్నిటిని సెలెక్ట్ అల్ అనే బాక్స్ లో tick చేసి , submit చేయాలి .

 తరువాత వచ్చే పేజి లో మనం ec ని పొందవచ్చు . 
తెలంగాణా వెబ్ సైట్ ద్వారా కూడా ఈ విధంగానే ec పొందవచ్చు . 

(ఈ వ్యాసాన్ని మీరు వీడియో రూపం లో చూడాలి అనుకుంటే ఈ క్రింద క్లిక్ చేసి  చూడవచ్చు )ఈ వ్యాసం పై ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో రాయండి . 


మీరు ఇవి కూడా చదవవచ్చు No comments:

Post a Comment