ఆరోగ్యం

చక్కటి ఆరోగ్యం కావాలంటే వ్యాయామం తప్పని సరి అని అందరకీ తెలుసు . వ్యాయామం చేయాలి అనే ఆలోచన రాగానే ఎంతో ఉత్సాహం గా వ్యాయామం మొదలు పెడతాం . రెండు మూడు వారాల పాటు వరుసగా వ్యాయామం చేస్తాం . ఐతే కొంతమంది లో వ్యాయామం ప్రారంభించాక కొద్ది కాలానికి కళ్ళు తిరగడం , బలహీనత వంటి లక్షణాలు కనబడుతుంటాయి . శరీరం లో శక్తి తగ్గడం వలననే ఇటువంటి లక్షణాలు కనబడుతుంటాయి . మనం చేసే వ్యాయామాలుకు తగినట్టు గా ఆహారం కూడా తీసుకోవాలి . లేదంటే శరీరం లో శక్తి తగ్గిపోతుంది . 


సాదారణంగా ఆడపిల్లలో ఇటువంటి లక్షణాలు కనబడుతుంటాయి . ప్రతీ రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో కనీసం 40 శాతం మంది లో ఇటువంటి లక్షణాలు కనబడతాయి అని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి . వ్యాయామాలు చేయడానికి ముందు ఏమీ తినక పోవడం . కఠిన మైన వ్యాయామాలు చేయడం తరువాత ఏమీ తినకపోవడం , నీరసం గా ఉన్నా వ్యాయామాలు చేయడం వంటి వాటివలన శక్తి తగ్గిపోతూ ఉంటుంది . కాబట్టి ప్రతీ రోజు వ్యాయామాలు చేసే వారు తప్పనిసరిగా ప్రోటీన్లు అధికం గా ఉండే గుడ్లు , మొలకెత్తిన గింజలు వంటివి తీసుకోవాలి . అప్పుడు మాత్రమే వ్యాయామం వలన వచ్చే ఫలితాలు పూర్తిగా పొందగలం . 

No comments:

Post a Comment